'టికెట్ టు హెల్' అంటున్న 'టాక్సిక్' మేకర్స్

ABN , Publish Date - Feb 21 , 2026 | 07:03 PM

'టాక్సిక్' మూవీ నుండి యశ్‌కు సంబంధించిన సెకండ్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. క్లీన్ షేవ్‌తో ఉన్న ఈ లుక్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Yash Toxic Movie

‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic) చిత్ర నిర్మాతలు మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేశారు, ఈసారి ప్రేక్షకులకు ‘టికెట్ టు హెల్’ని అందించారు. తాజాగా విడుదలైన స్ట్రైకింగ్ పోస్టర్‌లో రాకింగ్ స్టార్ యశ్‌ (Yash) ఎవరూ ఊహించని కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఈ క్లీన్-షేవ్ లుక్ పోస్టర్‌లో యశ్‌ పోషిస్తున్న మరో పాత్ర ‘టికెట్’ను పరిచయం చేశారు. ఇది చిత్రంలోని ఆయన సెకండ్‌ లుక్. వీటిని బ‌ట్టి చూస్తుంటే గ్రిప్పింగ్ డ‌బుల్ రోల్‌తో అద్భుత‌మైన క‌థ సిద్థమైనట్టు అర్థమౌతోంది.


ఇంతకుముందు విడుదలైన య‌శ్‌ గడ్డం లుక్ ‘రాయా’ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు స‌డ‌న్‌గా రిలీజ్ చేసిన ఈ క్లీన్-షేవ్ లుక్ కూడా అదే చరిత్రను మళ్లీ రిపీట్ చేయబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముందుగా విడుదలైన టీజర్‌లో యశ్‌ చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పటికే సోషల్ మీడియాలో తుఫాను సృష్టించి, సినిమాపై ఉన్న అంచనాలను ప్రపంచవ్యాప్తంగా పీక్స్‌కు తీసుకెళ్లింది. టీజర్‌ యూట్యూబ్‌లో భారతదేశంతో పాటు 9 దేశాల్లో ట్రెండ్ అవుతూ, ఈ సినిమాకు ఉన్న గ్లోబల్ రీచ్‌ను చాటిచెప్పింది. తన ఐకానిక్ గడ్డాన్ని వదిలేసి యశ్‌ చేసిన ఈ ‘టికెట్’ అవతార్‌ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. చూడ్డానికి నాజూగ్గా ఉన్నా మ‌రోవైపు భ‌య‌పెడుతున్న ఈ క్లీన్-షేవ్ లుక్ రెండు పాత్రల మధ్య ఉన్న మిస్టరీని మరింతగా పెంచింది. అలానే తాజా లుక్ రిలీజ్ కాగానే, కథ వివిధ కాలాల్లో సాగుతుందా? రెండు పాత్రలు ఎలా కలుస్తాయి? అనే అంశాలపై అనేక చర్చలు మొదలయ్యాయి.


యశ్‌తో కలిసి రచన చేసిన గీతూ మోహన్‌దాస్ (Geethu Mohan Das) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తోంది. కన్నడ, ఇంగ్లీష్‌ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, మలయాళ తదితర భాషల్లో మార్చి 19న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాను వెంకట్ కె. నారాయణ, యశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated Date - Feb 21 , 2026 | 07:03 PM