టాక్సిక్.. చప్పుడేది

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:47 PM

కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటిస్తోన్న తాజా చిత్రం టాక్సిక్ (Toxic). కెజిఎఫ్ లాంటి హిట్ తరువాత చాలా గ్యాప్ తీసుకొని యశ్ ఈ సినిమా చేస్తున్నారు. గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Toxic

కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటిస్తోన్న తాజా చిత్రం టాక్సిక్ (Toxic). కెజిఎఫ్ లాంటి హిట్ తరువాత చాలా గ్యాప్ తీసుకొని యశ్ ఈ సినిమా చేస్తున్నారు. గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాయ అనే పాత్రలో యశ్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ హైప్ ని కూడా క్రియేట్ చేశాయి. మార్చి 19 న టాక్సిక్ రిలీజ్ కానుంది.

మొదటి నుంచి కూడా టాక్సిక్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే టీజర్ కూడా మంచి హైప్ ను తీసుకొచ్చింది. కానీ, నిన్న రిలీజ్ అయిన సాంగ్ అభిమానులను నిరాశపర్చింది. ఆడియో పరంగా సాంగ్ ఓకే అయినా కూడా విజువల్స్ లేకపోవడంతో ఆశించినంత హైప్ ను తీసుకురాలేకపోయింది. సినిమా రిలీజ్ కి ఇంకా 16 రోజులు మాత్రమే ఉంది. అయినా ఇప్పటివరకు మేకర్స్ కానీ, యశ్ కానీ చప్పుడు చేయడం లేదు. దీంతో ఫ్యాన్స్ యశ్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎంత పెద్ద సినిమా అయినా కూడా ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. మొదటి నుంచి సినిమాపై అంచనాలు ఉన్నా కూడా ప్రమోషన్స్ లేకపోతే జనాల్లోకి వెళ్లడం చాలా కష్టం. ఏప్రిల్, ఆగస్టు లో వచ్చే సినిమాలే ఇప్పటి నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టాయి. అలాంటిది కేవలం 16 రోజుల్లో రిలీజ్ కావాల్సిన సినిమాకు ఏ రేంజ్ లో ప్రమోషన్స్ ఉండాలి. అందులోనూ యశ్ సినిమా అంటే ఇంకే రేంజ్ లో ఉండాలి. కానీ, అసలు సినిమా రిలీజ్ ఉందా? అనే అనుమానంలో అభిమానులు ఉన్నారు. మరి యశ్ ఈ 16 రోజుల్లో ఏలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

Updated Date - Mar 03 , 2026 | 06:18 PM