ధనుష్ స్పీడుకు.. బ్రేకులు లేవప్పా! సినిమాలే.. సినిమాలు

ABN , Publish Date - Apr 23 , 2026 | 07:07 PM

స్టార్ హీరోలందు ధనుష్ లెక్కే వేరప్పా.. అవును ఈ మాట ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మారు మోగిపోతోంది.

Dhanush

స్టార్ హీరోలందు ధనుష్ (Dhanush ) లెక్కే వేరప్పా.. అవును ఈ మాట ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మారు మోగిపోతోంది. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఏడాది లేదా రెండేళ్లు వెయిట్ చేయాలి. కానీ ధనుష్ విషయంలో మాత్రం సీన్ టోటల్ రివర్స్. బ్యాట్ పట్టిన క్రికెటర్‌లా సెంచరీల మీద సెంచరీలు బాదుతూ.. బాక్సాఫీస్ వరుస సినిమాలు చేస్తూ హిట్ల వర్షం కురిపిస్తున్నారు.

సౌత్ స్టార్ హీరోలలో అందరికన్నా ఫాస్ట్ గా సినిమాలు తీసే హీరోలు ఎవరు అంటే.. మలయాళంలో మోహన్‌ లాల్‌, మమ్ముట్టి వంటి సీనియర్‌ హీరోల పేర్లు వినిపిస్తాయి. కానీ నేటి తరం యంగ్ స్టార్లలో మాత్రం ఆ క్రెడిట్ కేవలం ధనుష్‌కే దక్కుతుంది. కథ కొత్తదైనా, పాతదైనా సరే.. క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసి, శరవేగంగా షూటింగ్ పూర్తి చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

గతేడాది ధనుష్ జోరు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఏకంగా మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్‌ను అలరించారు. కేవలం హీరోగానే కాదు.. డైరెక్టర్‌గా కూడా తన సత్తా చాటారు. తన మేనల్లుడ్ని హీరోగా పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కించిన నిలవుకు ఎన్మేల్ ఎన్నడీ కోబం చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఒక దర్శకుడిగా ధనుష్ విజన్ ఏంటో ఈ సినిమా మరోసారి నిరూపించింది.

అంతేకాదు.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ కుబేరతో ధనుష్ మ్యాజిక్ ఏంటో తెలిసింది. ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కేలా చేసింది. ఆ వెంటనే తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఇడ్లీ కడై కూడా డీసెంట్‌ టాక్‌తో దూసుకుపోయింది. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లడమే కాదు.. అవి కమర్షియల్ గా సక్సెస్ అయ్యేలా చూడటంలో ధనుష్‌ మాస్టర్ ప్లాన్ అమోఘం.

ఇక ఈ ఏడాది కూడా ధనుష్ క్యాలెండర్‌ చూస్తుంటే.. ఆయనకు ఖాళీ అనే పదం లేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే దర్శకుడు విఘ్నేష్‌ రాజాతో చేసిన యాక్షన్‌ థ్రిల్లర్ కర (Kara) షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్‌ 30న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అక్కడితో ఆగిపోతే ఆయన ధనుష్ ఎందుకు అవుతారు? అమరన్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ లైన్లో ఉంది. అలాగే లబ్బర్‌ పండు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన తమిజరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ చేయనున్నారు.

ఇక గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక క్రేజీ అప్డేట్ ఏంటంటే.. టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్‌ ఠాకూర్ (Mrunal Thakur) తో ధనుష్ ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారట. ఈ కాంబినేషన్ సెట్ అయితే బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ అవ్వడం ఖాయం. ఒక వైపు నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోగా నటిస్తూ.. మరోవైపు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తూ.. ఇంకోవైపు టాలెంటెడ్ డైరెక్టర్‌గా మెప్పిస్తూ.. ధనుష్ తన ప్రయాణాన్ని జెట్ స్పీడ్‌తో కొనసాగిస్తున్నారు. కష్టపడే తత్వం, సినిమాపై ఉన్న ఫ్యాషన్.. ఈ రెండే ధనుష్‌ను ఈ స్థాయిలో నిలబెట్టాయి.

Updated Date - Apr 23 , 2026 | 07:42 PM