అజిత్ లేకుండానే.. 'డేర్ డెవిల్' పూజా కార్యక్రమం

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:46 AM

'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ తర్వాత అగ్రహీరో అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో తెర‌కెక్క‌నున్న‌ 'డేర్ డెవిల్ మూవీ పూజా కార్యక్రమం సోమవారం జరిగింది.

'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ తర్వాత అగ్రహీరో అజిత్ కుమార్ (Ajith Kumar) హీరోగా అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) కాంబినేషన్‌లో 'డేర్ డెవిల్ (Dare Devil) పేరుతో మూవీ తెరకెక్కనుంది. అజిత్ కుమార్ సతీమణి షాలిని అజిత్ కుమార్ (Shalini Ajith Kumar) నిర్మించే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం. శ్రీలీల (Sreeleela) హీరోయిన్. ఇతర పాత్రల్లో ప్రభు, పార్తిబన్ (R. Parthiban), సునీల్ (Sunil) తదితరులు నటించనున్నారు. మరికొన్ని పాత్రలకు నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంది.

dd.jpg

ఈ నేపథ్యంలో సోమవారం హీరో అజిత్ లేకుండానే చిత్రం పూజా కార్యక్రమం సోమవారం జరిగింది. ఇందులో షాలిని, అధిక్ రవిచంచంద్రన్, శ్రీలీల, అనిరుద్, పార్తీపన్, ప్రభు తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan), హాస్య నటుడు రెడిన్ కింగ్స్ లే (Redin Kingsley) కూడా పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, ఈ మూవీలో ఉన్ని ముకుం దన్ ప్రతినాయకుడా లేదా రెండో హీరోనా అన్నది తెలియాల్సివుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Nov 03 , 2026 | 05:47 AM