అభిషన్ జీవింత్ : 'విత్ లవ్’ కాంబినేషన్‌లో మరో చిత్రం
ABN , Publish Date - Feb 14 , 2026 | 09:51 AM
‘విత్ లవ్’ (With Love) కాంబినేషన్‌లో మరో చిత్రాన్ని రూపొందిస్తామని ఆ చిత్ర హీరో అభిషన్ జీవింత్ (Abhishan Jeevinth) తెలిపారు.
‘విత్ లవ్’ (With Love) కాంబినేషన్‌లో మరో చిత్రాన్ని రూపొందిస్తామని ఆ చిత్ర హీరో అభిషన్ జీవింత్ (Abhishan Jeevinth) తెలిపారు. డెబ్యూ డైరెక్టర్ మదన్ దర్శకత్వంలో అభిషన్, అనస్వర రాజన్ జంటగా, సౌందర్య రజనీకాంత్, మహేశ్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘విత్ లవ్’ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చెన్నైలో సక్సెస్ వేడుకలను నిర్వహించింది.
అభిషన్ జీవింత్ మాట్లాడుతూ, ‘రజనీకాంత్ చెప్పిన ఆ ఒక్క మాటలో హీరోగా నటించాలనే నిర్ణయం తీసుకున్నాను. చిత్రం విడుదలైన తర్వాత మళ్ళీ రజనీని కలిసినపుడు ‘హీరో అయ్యారు’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ జీవితంలో మరచిపోలేనిది. ఈ సినిమా ఇంత విజయానికి ప్రధాన కారణం మీడియా మిత్రులే. మంచి రివ్యూతో ప్రేక్షకుల చెంతకు తీసుకెళ్ళారు. మా కాంబినేషన్‌లోనే మరో చిత్రం రూపొందిస్తాం’ అని పేర్కొన్నారు.
హీరోయిన్ అనస్వర మాట్లాడుతూ, ‘కొన్ని రోజుల క్రితం రజనీకాంత్‌ను ప్రత్యక్షంగా కలుసుకోవడం జీవితంలో మరిచిపోలేని సంఘటన. గత వారం థియేటర్ విజిట్‌కు వెళ్ళినపుడు చిత్రంలోని నా పాత్ర పేరుతో పిలవడం చాలా ఆనందం కలిగించింది’ అని అన్నారు.
నిర్మాత సౌందర్య మాట్లాడుతూ, ‘ఈ సినిమా సక్సెస్ కాగానే డాడీని కలిశాను. ఆయన ఓ నవ్వు నవ్వి... ఇది సక్సెస్సా అని ప్రశ్నించారు. 17 యేళ్ళుగా సినిమాలో అనేక శాఖల్లో పనిచేశాను. ఈ ఫ్యామిలీనే నాకు ఒక విజయాన్ని అందించింది. ఈ సినిమా మరో నిర్మాత నాకు తమ్ముడితో సమానం. అలాగే హీరో అభి నాకు బేబీ బ్రదర్. అతని నవ్వు చాలా బాగుంటుంది. సుదీర్ఘకాలం పాటు చిత్ర పరిశ్రమలో కొనసాగుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు’ అన్నారు.