విజయ్ కి మరో షాక్ ఇచ్చిన భార్య సంగీత

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:19 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) విడాకుల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా విజయ్ భార్య సంగీత (Sangeetha) ఆయనకు మరో లీగల్ షాక్ ఇచ్చారు.

Vijay

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) విడాకుల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా విజయ్ భార్య సంగీత (Sangeetha) ఆయనకు మరో లీగల్ షాక్ ఇచ్చారు. ఈ మధ్యనే ఆయన నుంచి విడాకులు కావాలని కోరిన సంగీత.. ఇప్పుడు విజయ్ ఇంట్లోనే ఉండడానికి పర్మిషన్ కోరారు. విజయ్ - సంగీత రెండేళ్లుగా విడిగా ఉంటున్నారు. తన భర్త వేరొక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, ఆయన నుంచి తనకు విడాకులు ఇప్పించాలని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు.

ఇక కొన్నిరోజుల నుంచి విజయ్.. సంగీతతో భారీ డీల్ కుదుర్చుకున్నారని, ఆమెకు భారీ భరణాన్ని ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. భరణం కింద సంగీతకు రూ. 250 కోట్లు ఇవ్వనున్నారని సమాచారం. ఎలాంటి గొడవలు లేకుండా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని విజయ్ చెప్పినట్లు టాక్. ఇక తాజాగా సంగీత మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. విడాకులు వచ్చేవరకు తనను తన భర్త ఇంట్లో ఉండడానికి అనుమతి కావాలని ఆమె కోరారు.

తాను లండన్ కి చెందిన వ్యక్తిని కావడంతో మరెక్కడా ఉండడానికి వీల్లేదని, అందుకే విజయ్ ఇంట్లో ఉండడానికి అనుమతిని ఇప్పించాలని కోరారు. అది తన హక్కు అని కూడా తెలిపారు. తాను ఇంట్లో ఉండాలని లాయర్ ద్వారా అడిగిస్తే విజయ్ బెదిరిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ భరణం, పరస్పర విడాకులు అంతో వస్తోన్న వార్తలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. పరస్పర విడాకులకు విజయ్ అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. మరి ఇప్పుడైనా విజయ్ స్పందిస్తాడేమో చూడాలి.

Updated Date - Mar 07 , 2026 | 04:35 PM