Aishwarya Lekshmi: నా బాడీ, డ్రెస్సింగ్‌పై.. ఎందుకంత శ్రద్ధ?
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:57 PM
ఇటీవల తాను ధరించిన దుస్తులపై కొందరు ప్రత్యేక శ్రద్ధ చూపించి వివాదాస్పదం చేయడంపై హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఘాటుగా స్పందించారు.
ఇటీవల తాను ధరించిన దుస్తులపై కొందరు ప్రత్యేక శ్రద్ధ చూపించి వివాదాస్పదం చేయడంపై హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) ఘాటుగా స్పందించారు. ఒక మహిళ దస్తులను అంత తీక్షణంగా చూసేవారు మన దేశ జీడీపీ, అనాథలుగా వదిలేస్తున్న వృద్ధులు గురించి ఎందుకు చర్చించకూడదంటూ ప్రశ్నించారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్య డ్రెస్సింగ్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రచ్చ మరింతగా పెరిగిపోతుండటంతో ఐశ్వర్య ఘాటుగా స్పందించారు. 'ఈవెంట్‌లో పాల్గొన్నవారు నా ముఖారవిందంపై దృష్టిసారించలేదు. ఇది నాకు ఇబ్బందిగా అనిపించింది. ఇలాంటి పరిస్థితి ఎదురైన పుడు బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది.
మన సంస్కృతి అనేది మహిళ ధరించే దుస్తులు లేదా ఆమె శరీరాకృతిలో లేదు. మనం ఇతరుల వద్ద నడుచుకునే తీరులో కూడా ఉంది. మహిళలను కించపరిచేలా మాట్లాడేవారిని ఎవరూ ప్రశ్నించడం లేదు. కానీ, ఒక స్త్రీ తన డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. నా డ్రెస్సింగ్, బాడీ లాంగ్వేజ్‌పై ఇంత శ్రద్ధ ఎందుకు చూపించి వివాదం సృష్టించారు? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.