విష్ణు విశాల్ గట్టా కుస్తీ 2.. ఆఫీసియల్ ట్రైలర్
ABN , Publish Date - Jun 28 , 2026 | 10:37 PM
విష్ణు విశాల్, ఐశర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం గట్టా కుస్తీ-2 తెలుగులో మట్టీ కుస్తీ.
విష్ణు విశాల్ ( Vishnu Vishal), ఐశర్య లక్ష్మి (Aishwarya Lekshmi) జంటగా నటించిన గట్టా కుస్తీ-2 (Gatta Kusthi 2) తెలుగులో మట్టీ కుస్తీ (Matti Kusthi) జూలై మూడో తేదీన విడుదలకు సిద్ధమైంది. 2022లో తమిళం, తెలుగు భాషల్లో వచ్చిన ఈ సినిమా తొలి భాగం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్ మంచి ఆదరణ దక్కించుకున్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ఆఫీసియల్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే గత సినిమాను మించిన కామెడీ, యాక్షన్‌తో తెరకెక్కించినట్లు అర్ధమవుతోంది. విష్ణు విశాల్, వేల్స్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కరుణాస్, మునీష్కాంత్, యోగిబాబు, రమ్య కృష్ణ తదితరులు నటించారు.