విశాల్‌: ‘జన నాయగన్‌’ వివాదం.. ఎలా జోక్యం చేసుకోవాలి...

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:21 PM

అగ్రహీరో విజయ్‌ - దర్శకుడు హెచ్‌. వినోద్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘జన నాయగన్‌’ మూవీ న్యాయపరమైన చిక్కుల్లో ఉందని, అలాంటపుడు ఎలా జోక్యం చేసుకోవాలి? అంటున్నారు విశాల్.

అగ్రహీరో విజయ్‌ - దర్శకుడు హెచ్‌.వినోద్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘జన నాయగన్‌’ మూవీ న్యాయపరమైన చిక్కుల్లో ఉందని, అలాంటపుడు ఎలా జోక్యం చేసుకోవాలని నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్‌  ప్రశ్నించారు. ఆదివారం చెన్నైలో జరిగిన తమిళ సినీ నిర్మాతల మండలి ఎన్నికల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు విశాల్‌ సమాధానమిస్తూ  ‘జన నాయగన్‌’ సెన్సార్‌ వివాదంలో ఒక వ్యక్తి గొంతు విప్పడం ముఖ్యం కాదు. నిర్మాతల మండలిలో 1519 మంది సభ్యులున్నారు. వారంతా కలిసి సెన్సార్‌ కార్యాలయానికి వెళితే ఏం జరుగుతుంది? అది త్వరలోనే జరగబోతుంది.

ఈ మూవీ వివాదం కోర్టుకు వెళ్లింది. అలాంటపుడు ఎలా జోక్యం చేసుకోగలం. బహుశా నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్‌ నిర్మాతల మండలిని ఆశ్రయించి ఉంటే ఏదో ఒకటి జరిగి ఉండేది. కానీ, కోర్టుకు వెళ్లాక ఏం మాట్లాడగలం. సెన్సార్‌ కార్యాలయంలో ఐదుగురు వ్యక్తులు కూర్చొని కోట్లాది ప్రజలు ఏది చూడాలో, చూడకూడదో ఎలా నిర్ణయిస్తారు? దీనిని నేను ఏకీభవించను. కానీ, సెన్సార్‌ సర్టిఫికెట్‌ అనేది  నిబంధన కాబట్టి అందుకు అనుగుణంగా నడుచుకుంటాం’ అని పేర్కొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 02:29 PM