సుందర్.సి: మొగుడు ఆ సినిమాలకు తగ్గకుండా ఉంటుంది
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:10 PM
విశాల్(Vishal), సుందర్. సి (Sundar C)కలయికలో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
విశాల్(Vishal), సుందర్. సి (Sundar C)కలయికలో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆంబళ’, ‘మద గద రాజా’ చిత్రాలు తర్వాత వీరిద్దరి కాంబోలో ‘మొగుడు’ (Mogudu) సినిమా తెరకెక్కుతోంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. అవని సినిమాస్ ప్రై.లి., బెంజ్ మీడియా ప్రై.లి. బ్యానర్లపై ఈ మూవీని అరుణ్ కుమార్, ఖుష్బూ సుందర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవదీప్, సంపత్, అజయ్ ఘోష్, గరుడ రామ్, వీటీవీ గణేష్, యోగి బాబు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ప్రోమోను ఇదివరకే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఓ సాధారణ మొగుడిలా ఇంట్లో అన్ని పనులు చేస్తూనే.. అండర్ కవర్ పోలీస్‌లా రౌడీలను చితక్కొట్టేశాడు విశాల్. అన్ని రకాల అంశాల్ని జోడించిన ఈ మూవీని ఫుల్ మాస్ కమర్షియల్ యాంగిల్‌లో సుందర్. సి ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టుగా టైటిల్ ప్రోమోతో చెప్పేసారు. సుందర్. సి చిత్రాలకు మాస్ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మూవీని కూడా వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఉండేట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తయింది. తదుపరి షెడ్యూల్‌ను కోల్ కత్తా , గోవా , చెన్నై ల్లో ప్లాన్ చేశారు. హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు.