మార్చి నెలలో విడుదలయ్యే అవకాశం

ABN , Publish Date - Feb 09 , 2026 | 07:43 PM

విజయ్‌ (Vijay) కథానాయకుడిగా హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జన నాయగన్‌’ (Jana Nayagan). సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ  సినిమా సెన్సార్‌ బోర్డు వివాదంతో వాయిదా పడింది.

విజయ్‌ (Vijay) కథానాయకుడిగా హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జన నాయగన్‌’. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ  సినిమా సెన్సార్‌ బోర్డు వివాదంతో వాయిదా పడింది. మద్రాసు హైకోర్టు, సుప్రీంకోర్టు, సింగిల్ బెంచ్‌, డివిజన్‌ బెంచ్‌.. ఇలా జనవరి నెల అంతా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా  ‘జన నాయగన్‌’((Jana Nayagan) విడుదలకు సిద్ధమవుతోంది. కోర్టు ఆదేశాల మేరకు సినిమాను  చిత్ర బృందం సెన్సార్‌ బోర్డు రివ్యూ కమిటీకి పంపింది. అంతా సబబుగా జరిగితే మార్చి నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

అసలు ఏం జరిగిందంటే. 
జన నాయగన్‌కు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలని సెన్సార్‌ బోర్డుకు జనవరి 9న మద్రాసు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సీబీఎఫ్‌సీ మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీపై స్టే విధించింది. ఈ స్టేను సవాలు చేస్తూ ప్రొడక్షన్ హౌస్  సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సినిమా విడుదల విషయంలో జోక్యానికి నిరాకరించిన  సుప్రీంకోర్టు  మద్రాసు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది.

సుదీర్ఘ వాదనల అనంతరం  సినిమాలో విదేశీ శక్తుల సాయంతో దేశంలో మత కల్లోలం సృష్టించే సన్నివేశాలు ఉన్నాయని మద్రాసు హైకోర్టు తెలిపింది. దీంతో సెన్సార్‌బోర్డు సమీక్ష కమిటీ సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకే చిత్రాన్ని రివైజింగ్‌ కమిటీ పంపడానికి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ‘జన నాయగన్‌’ చిత్ర బృందం మూవీని మరోసారి రివ్యూ కమిటీకి పంపింది.

Updated Date - Feb 09 , 2026 | 11:23 PM