విజయ్ ప్రమాణస్వీకారం.. వారసులు ఎక్కడ

ABN , Publish Date - May 10 , 2026 | 06:23 PM

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. మే 4న వెలువడిన ఫలితాల్లో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ (Vijay) 108 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించారు.

Vijay

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. మే 4న వెలువడిన ఫలితాల్లో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ (Vijay) 108 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించారు. ఎన్నో సవాళ్లు, మరెన్నో రాజకీయ సమీకరణాల మధ్య ఎట్టకేలకు మే 10న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ అపురూప ఘట్టంలో అందరి కళ్లూ విజయ్ కుటుంబం కోసం వెతికాయి. కానీ, అక్కడ కనిపించిన దృశ్యాలు అభిమానులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.


విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ రంగంతో పాటు, రాజకీయ ప్రతినిథులు భారీగా హాజరయ్యారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ త్రిష అక్కడ చేసిన సందడి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ శుభకార్యంలో విజయ్ మొదటి భార్య సంగీత ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం భార్య మాత్రమే కాదు, కొడుకు జాసన్ సంజయ్, కూతురు దివ్య సాషా కూడా ఈ వేడుకకు దూరంగా ఉండడం గమనార్హం. ఒక స్టార్ హీరో కొడుకుగా కంటే, ఒక ముఖ్యమంత్రి వారసుడిగా జాసన్ సంజయ్ తండ్రి గెలుపుపై సోషల్ మీడియాలో కనీసం ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం అభిమానులను ఇబ్బందికి గురిచేస్తోంది. విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ ప్రమాణ స్వీకారం వరకు వారసులెవరూ తండ్రి పక్కన నిలబడకపోవడం ఒక చేదు జ్ఞాపకమే అని చెప్పాలి.


విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉంటే, ఆయన కొడుకు జాసన్ సంజయ్ మాత్రం వెండితెర వెనుక తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. హీరోగా ఎంట్రీ ఇస్తాడని అందరూ ఆశించినా, తండ్రికి భిన్నంగా మెగాఫోన్ పట్టుకున్నాడు జాసన్. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్‌తో సిగ్మా అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. తండ్రి సీఎంగా చరిత్ర సృష్టిస్తే, కొడుకు దర్శకుడిగా ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి. విజయ్ రాజకీయాల్లో ఒక యుద్ధాన్ని గెలిచి సీఎం కుర్చీని దక్కించుకున్నారు. కానీ, ఈ గెలుపు ఉత్సాహంలో ఆయన కుటుంబం కలిసి లేకపోవడం అభిమానులకు మింగుడుపడడం లేదు. వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఎలా ఉన్నా, ఒక రాష్ట్రానికి సారథిగా విజయ్ ఎలాంటి పాలన అందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Updated Date - May 10 , 2026 | 06:26 PM