విజయ్- త్రిషను అతను విడదీయగలడా..

ABN , Publish Date - May 12 , 2026 | 02:51 PM

ఎట్టకేలకు విజయ్ (Vijay) సీఎం అయ్యాడు. ఆయనఎన్నికల్లో గెలవడానికి ప్రధాన కారణం త్రిష (Trisha) అని అందరికి తెల్సిందే. అయితే మొదటి నుంచి కూడా త్రిషను విజయ గెలిచేవరకే పక్కన పెట్టుకుంటాడు.. ఆ తరువాత నెమ్మదిగా బయటకు పంపించేస్తాడు అని వార్తలు వచ్చాయి.

Vijay

ఎట్టకేలకు విజయ్ (Vijay) సీఎం అయ్యాడు. ఆయనఎన్నికల్లో గెలవడానికి ప్రధాన కారణం త్రిష (Trisha) అని అందరికి తెల్సిందే. అయితే మొదటి నుంచి కూడా త్రిషను విజయ గెలిచేవరకే పక్కన పెట్టుకుంటాడు.. ఆ తరువాత నెమ్మదిగా బయటకు పంపించేస్తాడు అని వార్తలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. విజయ్ నుంచి త్రిషను దూరం చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని కోలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలయ్యింది.


విజయ్ పార్టీ పుట్టకముందు నుంచి కూడా త్రిష తో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. పార్టీ పెట్టి, ఎన్నికల్లో నిలబడ్డాక ఈ రూమర్స్ ఎక్కువ అయ్యాయి. విజయ్ భార్య సంగీత విడాకులు కోరడం.. ఆమె స్వయంగా త్రిషతో ఎఫైర్ పెట్టుకున్నాడు అని చెప్పడంతో కన్ఫర్మ్ అయ్యింది. ఏం జరిగినా కూడా త్రిషను విజయ్ వదలలేదు. పుకార్లను నిజం చేస్తూ ఇద్దరూ కలిస ఒక పెళ్ళికి అటెండ్ అయ్యి సంచలనం సృష్టించారు. ఆ తరువాత నుంచి త్రిష పేరు మారుమ్రోగిపోయింది. మే 4 న విజయ్ ఎన్నికల్లో గెలవడం.. అదేరోజు త్రిష పుట్టినరోజు రావడం.. విజయ్ ఇంటికి వెళ్లి ఆమె సెలబ్రేట్ చేసుకోవడం మరింత అనుమానాలకు దారితీసింది.


ఇక విజయ్ ప్రమాణస్వీకారం రోజున త్రిష చేసిన సందడి అంతా ఇంతా కాదు. సొంత భార్యలా ఎమోషనల్ అవ్వడమే కాకుండా విజయ్ తల్లిని, సిస్టర్స్ ని కౌగిలించుకొని కంగ్రాట్స్ చెప్పింది. దీంతో విజయ్ - త్రిష రిలేషన్ లో ఉన్నారు. త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారు అని కన్ఫర్మ్ చేశారు. అయితే సీఎం కాకముందు వరకు ఇది ఓకే కానీ, విజయ్ సీఎం అయ్యాక.. ఇలాంటి రిలేషన్స్ ఆయన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేస్తోందని మద్దతుదారులు చెప్పుకొస్తున్నారు. దీంతో విజయ్ పరువు కాపాడడం కోసం ఆయన తండ్రి చంద్రశేఖర్ తో మంతనాలు జరిపినట్లు సమాచారం. త్రిషను విజయ్ నుంచి దూరం చేయడానికి ప్లాన్ చేసారట. త్రిష కేవలం పొలిటికల్ సపోర్ట్ కోసమే విజయ్ వెనుక ఉంటుంది, ఇప్పుడు ఆమె విజయ్ కి దగ్గరైతే.. ప్రజల్లో ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. నెమ్మదిగా విజయ్ కి ఈ విషయాన్నీ కన్వే చేయమని చంద్రశేఖర్ తో సపోర్టర్స్ మాట్లాడారట. చంద్రశేఖర్ సైతం.. విజయ్ కి త్రిషని దూరం పెట్టమని చెప్పడానికి సిద్దమైనట్లు టాక్. మరి తండ్రి మాట విజయ్ వింటాడా.. ? వారిద్దరిని విడగొట్టడం చంద్రశేఖర్ వలన అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - May 12 , 2026 | 03:18 PM