సర్టిఫికెట్ రాగానే.. ‘జననాయగన్’ విడుదల
ABN , Publish Date - May 11 , 2026 | 11:22 AM
‘జననాయగన్’ సినిమా విడుదల గురించి నిర్మాత ఓ ఆసక్తికర విషయం తెలిపారు.
ఎట్టకేలకు దళపతి విజయ్ (Thalapathy Vijay) తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు అభిమానుల దృష్టంతా ఆయన నటించిన ‘జననాయగన్’ (Jana Nayagan) విడుదలపైనే ఉంది.
చెన్నైలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఈ మూవీ నిర్మాత వెంకట్ కె నారాయణను మీడియా ప్రశ్నించగా ఆయన స్పందించారు. ‘మేము సెన్సార్‌బోర్డు సర్టిఫికెట్ కోసం ఎదురు చూస్తున్నాం. అది ఎంత త్వరగా వస్తే అంత త్వరగా సినిమాను విడుదల చేస్తాం.
విజయ్ తమిళనాడు సీఎం కావడం చాలా ఆనందంగా ఉంది. విజయ్ సర్‌కు అభినందనలు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఆయన నెరవేరుస్తారనే నమ్మకముంది’ అని అన్నారు. ‘జననాయగన్’ చిత్రాన్ని హెచ్.వినోద్ తెరకెక్కించారు. సెన్సార్ నిబంధనల కారణంగా విడుదల వాయదా పడిన విషయం తెలిసిందే.