Jana Nayakudu: జన నాయకుడు వాయిదా ..
ABN , Publish Date - Jan 07 , 2026 | 08:23 PM
అనుకున్నదే అయ్యింది. దళపతి విజయ్ (Vijay) నటించిన చివరి చిత్రం జన నాయకుడు (Jana Nayakudu) రిలీజ్ వాయిదా పడింది. రెండు రోజులుగా ఈ సినిమా సెన్సార్ సమస్యలతో పోరాడుతున్న విషయం తెల్సిందే.
Jana Nayakudu: అనుకున్నదే అయ్యింది. దళపతి విజయ్ (Vijay) నటించిన చివరి చిత్రం జన నాయకుడు (Jana Nayakudu) రిలీజ్ వాయిదా పడింది. రెండు రోజులుగా ఈ సినిమా సెన్సార్ సమస్యలతో పోరాడుతున్న విషయం తెల్సిందే. బుధవారం కోర్టులో జరిగిన వాదనలు కూడా జన నాయకుడుకు హెల్ప్ కాలేదు. కోర్టు వాయిదాను రిజర్వ్ లో పెట్టింది. జనవరి 9 న తుది తీర్పు ప్రకటించనుంది. అప్పటివరకు సినిమాను విడుదల చేయడానికి లేదు. ఇక చేసేది లేక ఈ సినిమాను మేకర్స్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
కేవలం తెలుగు, హిందీ భాషల్లోనే కాకుండా తమిళనాడులో కూడా జన నాయగన్ రిలీజ్ కావడం లేదు. ఇప్పటికే చెన్నైలోని థియేటర్స్ టికెట్ బుకింగ్స్ చేసిన వారికి తమ డబ్బులను వెనక్కి ఇచ్చేస్తామని అధికారికంగా ప్రకటించింది. ఇంకోపక్క ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అయినా RFT ఫిల్మ్స్ సైతం జన నాయగన్ వాయిదా పడిందని తెలిపింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అన్యాయమని, కావాలనే విజయ్ సినిమాను అడ్డుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు.
అసలు సెన్సార్ సమస్య ఏంటి.. అంటే.. ఏ సినిమా రిలీజ్ కి అయినా కూడా సెన్సార్ సర్టిఫికెట్ అనేది అవసరం. ఆ సినిమాలో ఎలాంటి సీన్స్ ఉంచాలి.. ఏ డైలాగ్స్ కట్ చేయాలి. ఇవన్నీ సెన్సార్ చూసి సర్టిఫికెట్ ఇస్తేనే సినిమాను రిలీజ్ చేస్తారు. ఇక జన నాయకుడు సినిమాను మొదట సెన్సార్ కి పంపించగా కొన్ని సీన్స్ ని కట్ చేయాలనీ చెప్పారు. దానికి తగ్గట్లే మేకర్స్ సైతం చేసి మరోసారి సెన్సార్ కి పంపించడం జరిగింది.
అయితే ఇప్పటివరకు వారి నుంచి సర్టిఫికెట్ రాలేదు. దీంతో కెవిఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం కోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి. కోర్టు శుక్రవారం ఉదయం తీర్పును ప్రకటిస్తుంది, ఆ తీర్పు సినిమాకు అనుకూలంగా ఉంటే, సెన్సార్ బోర్డు శుక్రవారం ఏదో ఒక సమయంలో లేదా గరిష్టంగా శనివారానికల్లా సర్టిఫికేట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అంటే అటుఇటుగా రెండు మూడు రోజుల్లో జన నాయగన్ రిలీజ్ అవుతుంది. అది మేకర్స్ రిలీజ్ చేస్తే.. లేదు అంటే కొత్త డేట్ ను విజయ్ వెతుక్కోవాల్సిందే.