Vijay: తొక్కిసలాట జరుగుతున్నా.. ప్రసంగం ఎందుకు ఆపలేదు

ABN , Publish Date - Jan 13 , 2026 | 01:12 PM

కరూర్ (Karur stampede) తొక్కిసలాట ఘట నపై సీబీఐ (CBI) అధికారులు సంధించిన వరుస ప్రశ్నలకు తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీ వీకే) పార్టీ అధినేత విజయ్ ఉక్కిరిబిక్కిరి అయినట్టు తెలిసింది.


» తొక్కిసలాట జరుగుతున్నా ప్రసంగం ఎందుకు ఆపలేదు?
» జనం ప్రాణాల కంటే ప్రచారమే ప్రధానం అనిపించిందా?
» చాలామంది స్పృహ కోల్పోవడం వీడియోల్లో కనిపిస్తోంది..
» కళ్లముందు ఇంత జరిగినా ప్రసంగం ఎలా కొనసాగించారు?
» కేవలం నీళ్ల బాటిళ్లు విసిరితే సరిపోతుందనుకున్నారా?
» తక్షణం చర్యలకు సహచరుల్ని ఎందుకు పురమాయించలేదు?
» టీవీకే అధినేతకు వంద ప్రశ్నలు సంధించిన సీబీఐ
» ఆరు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు
» మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని స్పష్టీకరణ


కరూర్ (Karur stampede) తొక్కిసలాట ఘట నపై సీబీఐ (CBI) అధికారులు సంధించిన వరుస ప్రశ్నలకు తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీ వీకే) పార్టీ అధినేత విజయ్ ఉక్కిరిబిక్కిరి అయినట్టు తెలిసింది. తమిళనాడులోని కరూర్లో గతేడాది సెప్టెంబరు 27న విజయ్ రోడోలో తొక్కిసలాట జరిగి 41 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ ఘటనపై సీబీఐ (vijay) దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే ఇప్పటికే సీబీఐ అధికారులు కరూ ర్లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకుని టీవీకే పార్టీ ప్రముఖులు, నాడు భద్రతా విధుల్లో పాల్గొన్న పోలీసు అధికారులు, మృతుల కుటుంబీకులను విచారించారు. తాజాగా సీబీఐ జారీ చేసిన సమన్ల మేరకు సోమవారం ఢిల్లీ లోని సీబీఐ ప్రధానకార్యాలయంలో విచారణకు విజయ్ హాజరయ్యారు. ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. 

ఈ సందర్భంగా అధికారులు ఆయనకు వంద ప్రశ్నలు సంధించారు. ఆరు గంటల పాటు విచారణ కొనసాగింది. 'రోడోలో ఒకవైపు తొక్కిసలాట జరుగుతున్నా, వెంటనే ప్రసంగం ఎందుకు ఆపలేదు? మీకు జనం ప్రాణాల కంటే ప్రచారమే ప్రధానం అనిపించిందా? తొక్కిసలాటతో చాలామంది స్పృహతప్పి పడిపోయి నట్టు వీడియోల్లో కనిపిస్తోంది, మీ కళ్లముందు ఇంత జరుగుతున్నా ప్రసంగాన్ని ఎలా కొనసాగించారు? కేవలం నీళ్ల బాటిళ్లు విసిరితే సరిపోతుందనుకున్నారా? తక్షణం చర్యలకు మీ సహచరుల్ని ఎందుకు పురమాయించలేదు? ఉదయం 11.30 గంటలకు రోడో ఉంటుందని ప్రకటించి, సాయంత్రం 6.30 గంటలకు వెళ్తే జనం ఇబ్బంది పడతారని మీకు తెలియదా?' అంటూ విజయ్కు వరుస ప్రశ్నలను సీబీఐ అధికారులు సంధించినట్టు తెలిసింది. కాగా, విచారణ పూర్తి కాకపోవడంతో మంగళవారం కూడా విచారణకు రావాలని సీబీఐ అధికారులు ఆయనకు సూచించారు. అయితే, పొంగల్ పండుగ ఉన్నందున మరో తేదీన వస్తానని విజయ్ చెప్పగా.. అందుకు సీబీఐ కూడా అంగీకరించింది. మళ్లీ ఏ రోజు విచారణకు రావాలో తర్వాత తెలియజేస్తామని సీబీఐ పేర్కొన్నట్టు అధికారులు తెలిపారు

Updated Date - Jan 13 , 2026 | 01:26 PM