Dhanush: ఈసారి పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో వెంకీ అట్లూరి మూవీ!
ABN , Publish Date - Jul 30 , 2026 | 04:16 PM
ధనుష్ 'సార్' సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఒకేసారి ఆకట్టుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. వీరిద్దరు మరోసారి జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ధనుష్ (Dhanush) 'సార్' సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఒకేసారి ఆకట్టుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి (Venky atluri). వీరిద్దరు మరోసారి జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని వెంకీ అట్లూరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే ధనుష్‌కు కొత్త కథకు సంబంధించిన స్టోరీ లైన్ వినిపించానని, ఆయన నుంచి సానుకూల స్పందన లభించిందని వెంకీ తెలిపారు. ప్రస్తుతం తాను తెరకెక్కిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా విడుదలైన తర్వాత ఈ కథపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తానని చెప్పారు. ఈసారి ధనుష్‌ను పూర్తిగా భిన్నమైన అవతారంలో చూపించబోతున్నట్లు వెంకీ అట్లూరి వెల్లడించారు. 'పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. కథలో బలమైన భావోద్వేగాలతో పాటు కమర్షియల్ అంశాలకు కూడా పెద్దపీట వేయనున్నాం' అని చెప్పారు.
గతంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన 'సార్' (Vaathi) చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థ నేపథ్యంలో రూపొందిన ఆ చిత్రం ఇద్దరికీ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పుడు అదే విజయవంతమైన కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటులు, నిర్మాత, షూటింగ్ షెడ్యూల్ వంటి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం వెంకీ అట్లూరి 'విశ్వనాథ్ అండ్ సన్స్' పనులతో బిజీగా ఉండగా, ధనుష్ కూడా వరుస చిత్రాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రానున్న కొత్త సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.