నాగ చైత‌న్య‌, స‌మంత దారిలో.. వరలక్ష్మి

ABN , Publish Date - Jul 20 , 2026 | 10:40 AM

సినిమాల్లో విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ క్రీడా రంగంలోకి కూడా అడుగు పెట్టారు.

Varalaxmi Sarathkumar

సినిమాల్లో విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) క్రీడారంగంలోకి కూడా అడుగుపెట్టారు. తమిళనాడు పికిల్‌బాల్ అసోసియేషన్ (Tamil Nadu Pickleball Association TNPA) నిర్వహించే తమిళనాడు ప్రీమియర్ పికిల్‌బాల్ లీగ్ (TNPPL) సీజన్-2లో పాల్గొనే చెన్నై తమిళ్ టైటాన్స్ జట్టుకు ఆమె యజమానిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ విషయాన్ని తమిళనాడు పికిల్‌బాల్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్‌ను జట్టు యజమానిగా స్వాగతిస్తున్నామని తెలిపింది. క్రీడలపై ఆమెకు ఉన్న ఆసక్తి, అత్యుత్తమ ప్రతిభను ప్రోత్సహించే తత్వం లీగ్‌కు మరింత బలం చేకూరుస్తుందని అసోసియేషన్ పేర్కొంది.

ఇటీవలి కాలంలో భారతదేశంలో పికిల్‌బాల్‌కు మంచి ఆదరణ లభిస్తోన్న విష‌యం తెలిసిందే. యువతతో పాటు సినీ, వ్యాపార ప్రముఖులు కూడా ఈ క్రీడపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్ నుంచి నాగ చైత‌న్య‌, స‌మంత వంటి వారు ప్ర‌త్యేక టీమ్స్ క‌టిగి ఉండ‌గా ఇప్పుడు వ‌ర‌ల‌క్ష్మి ఈ జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి శరత్‌కుమార్ లీగ్‌లో జట్టు యజమానిగా చేరడం పికిల్‌బాల్‌కు మరింత గుర్తింపు తీసుకురానుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - Jul 20 , 2026 | 11:00 AM