ద‌ర్శ‌న్‌.. రేణుకా స్వామి కేసులో ట్విస్ట్! అప్రూవర్ ప్రదోష్ కుట్ర బహిర్గతం.. కేసు నమోదు

ABN , Publish Date - Sep 16 , 2026 | 02:43 PM

చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ట్విస్ట్ ఏర్పడింది.

Darshan

చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసు (Renukaswamy Murder Case)లో ట్విస్ట్ ఏర్పడింది. నటుడు దర్శన్ (చిత్రదుర్గ రేణుకా స్వామి) తో పాటు 14వ నిందితుడు ప్రదోష్ రావు (Pradosh Rao) అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రదోష్ జైలు నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ కాల్స్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అప్రూవర్‌గా మారి కేసు నుంచి బయటపడాలని చేసిన కుట్రకు జైలు సిబ్బంది ఒకరు సంపూర్ణంగా సహకరించిన విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో ప్రదోష్‌తో పాటు జైలు సిబ్బంది పైనా కొత్త క్రిమినల్ కేసు నమోదైంది. జైలులో ఉండేవారు ఎవరైనా కుటుంబ సభ్యులు లేదా న్యాయవాదులతో అత్యవసరంగా మాట్లాడదలచుకుంటే జైలుశాఖ అధికారులు నిబంధనలు పాటించి వారికి తగిన సమయం కేటాయిస్తారు. సంబంధిత ఫోన్ నెంబర్లు జైలు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.

కానీ ప్రదోష్ నిబంధనలు గాలికి వదిలి జైలు ఉద్యోగి మౌనేశ్ సాయంతో మరో ఖైదీ పేరిట ఇతరులకు ఫోన్ చేసినట్టు వెలుగులోకి వచ్చింది. న్యాయవాది నెంబర్‌ అంటూ అవకాశం లభించినప్పుడల్లా భార్యతో మాట్లాడినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్‌లో ఈమేరకు మంగళవారం కేసు నమోదు చేశారు.

Updated Date - Sep 16 , 2026 | 02:43 PM