ఎవరితోనూ పొత్తు ఉండదు.. ఒంటరిగానే పోరాడుతా...
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:24 AM
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమిలో చేరకుండా, ఎవరితోనూ పొత్తు లేకుండా అధికారంలోకి వస్తామని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ (thalapathy vijay) ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమిలో చేరకుండా, ఎవరితోనూ పొత్తు లేకుండా అధికారంలోకి వస్తామని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ (thalapathy vijay) ధీమా వ్యక్తం చేశారు.
బుధవారం సాయంత్రం చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి రకరకాల వదంతులు రేగుతున్నాయని పేర్కొన్నారు.
ఏదో ఒక పార్టీకి బీ-టీం అంటూ చెబుతున్నారని, నిజానికి తాను ఎవరి టీం కాదని, ప్రజల టీం మాత్రమేనని స్పష్టం చేశారు. తాను సెక్యులర్ విధానానికే కట్టుబడి ఉన్నానని, సెక్యులరిజంను వ్యతిరేకించేవారితో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అయితే.. ఇటీవల నటి త్రిష (Trisha Krishnan) కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ను కలిసిందనే న్యూస్ బాగా వైరల్ అయింది. విజయ్ టీవీకే పార్టీతో పొత్తు, విజయ్ రీసెంట్ ఇష్యూల నుంచి బయట పడేసేందుకు ప్రయత్నాలు చేసిందని ఈ నేపథ్యంలో త్వరలోనే విజయ్ పార్టీ ఎన్డీఏలో చేరబోతోందని వార్తలు వచ్చాయి.
తీరా ఇప్పుడు అలాంటిదేమీ లేదని తమ పార్టీకంటూ ఓ సిద్దాంతం ఉందంటూ చెప్పి బయట ప్రచారం జరుగుతున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు విజయ్.