సీరియల్ నటి కారుకు ప్రమాదం.. డ్రైవర్ మృతి
ABN , Publish Date - Mar 03 , 2026 | 05:59 PM
తమిళ సీరియల్ నటి దేవిప్రియ (Devipriya) కారు ప్రమాదానికి గురైంది. సోమవారం తెల్లవారుజామున దేవిప్రియ తన అసిస్టెంట్ తో కలిసి చెన్నై నుంచి తిరుచ్చి బయల్దేరారు.
తమిళ సీరియల్ నటి దేవిప్రియ (Devipriya) కారు ప్రమాదానికి గురైంది. సోమవారం తెల్లవారుజామున దేవిప్రియ తన అసిస్టెంట్ తో కలిసి చెన్నై నుంచి తిరుచ్చి బయల్దేరారు. పెరంబలూర్ వద్ద సడెన్ గా కారు టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ రోడ్డుపక్కనే కారు ఆపి టైరును మారుస్తుండగా ఒక కారు వేగంగా వచ్చి ఆగి ఉన్న దేవిప్రియ కారును ఢీకొంది.
ఈ ప్రమాదంలో దేవిప్రియ తృటిలో తప్పించుకోగా.. డ్రైవర్ ముత్తు గణేశన్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా అసిస్టెంట్ దివాకర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే దివాకర్ ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.