Trisha: త్రిష రాజకీయాల్లోకి రానుందా? వెబ్ ఫలితాలు మదురైలో పోస్టర్లు వైరల్..
ABN , Publish Date - Aug 04 , 2026 | 10:07 AM
దక్షిణాది అగ్ర కథానాయిక త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి.
దక్షిణాది అగ్ర కథానాయిక త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తమిళనాడులోని మదురై నగరంలోని పలు ప్రాంతాల్లో ఆమె రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తూ వెలిసిన వాల్‌పోస్టర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పోస్టర్లు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా, కోలీవుడ్, తమిళ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.
"ఒక రాజకీయ పార్టీ పురుడు పోసుకునే తొలి గడ్డ మదురై. మీనాక్షి అమ్మవారి ఆశీస్సులతో తమిళ సంఘాల చరిత్రలో తొలిసారి మా అక్క త్రిషకు తమిళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తొలి సంఘం 'మదురై జిల్లా త్రిష నర్పణి మండ్రం'" అని పోస్టర్లలో పేర్కొన్నారు. అలాగే త్రిషను ప్రజాసేవలోకి ఆహ్వానిస్తూ, ఆమె నాయకత్వాన్ని కోరుతున్నట్లు పోస్టర్లపై ముద్రించారు. ఈ పోస్టర్లు వెలుగులోకి రావడంతో త్రిష రాజకీయాల్లోకి వస్తున్నారా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. అయితే, త్రిష నుంచి గానీ, ఆమె బృందం నుంచి గానీ రాజకీయ ప్రవేశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఇవి అభిమానుల అభిప్రాయమా? లేక భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతమా? అన్నది ఆసక్తికరంగా మారింది.
కోలీవుడ్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో త్రిషకు ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తున్నాయి. విజయ్ రాజకీయ పార్టీ స్థాపించిన సమయంలోనూ, అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల సమయంలోనూ త్రిష పేరు పలుమార్లు వార్తల్లో నిలిచింది. ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష సోషల్ మీడియాలో చేసిన ప్రత్యేక శుభాకాంక్షల పోస్టు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీంతో వీరిద్దరి స్నేహంపై మరోసారి చర్చ మొదలైంది.