ఇండిపెండెన్స్ డే వేడుకల్లో త్రిష.. విజయ్ కుటుంబంతో కనిపించి వైరల్!
ABN , Publish Date - Aug 15 , 2026 | 10:33 AM
తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో దినోత్సవ వేడుకల్లో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో దినోత్సవ వేడుకల్లో నటి త్రిష (Trisha) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె హాజరై వేడుకలను వీక్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) తల్లిదండ్రులతో కలిసి త్రిష ముందు వరుసలో కూర్చోవడం ఆసక్తికరంగా మారింది. కార్యక్రమానికి హాజరైన అధికారులు, ప్రముఖులను త్రిష చిరునవ్వుతో పలకరిస్తూ కనిపించారు. వారిని అభివాదం చేస్తూ ఉత్సాహంగా కార్యక్రమాన్ని వీక్షించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ రాజకీయాల్లోకి రావడంతో త్రిష పేరు కూడా తరచూ వార్తల్లో వినిపిస్తోంది. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ త్రిష హాజరు కావడం చర్చనీయాంశమైంది. తాజాగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఆమె పాల్గొనడంతో మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు.
త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ కొన్ని పోస్టర్లు తమిళనాడులో కనిపించాయి. దీనిపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరిగింది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మరోవైపు అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ కూడా త్రిష రాజకీయ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి.