Trisha: ఆ ముగ్గురు హీరోలకు త్రిష కీలకం.. పోస్ట్‌ వైరల్‌..

ABN , Publish Date - May 25 , 2026 | 11:58 AM

ఈ మధ్యకాలంలో త్రిష పేరు విపరీతంగా వైరల్‌ అవుతోంది. అంతే ట్రెండింగ్‌లోనూ ఉంటుంది. అందుకు ఆమె చేస్తున్న సినిమాలు ఓ కారణమైతే.. తమిళ రాజకీయాలు మరో కారణం.

ఈ మధ్యకాలంలో త్రిష (trisha) పేరు విపరీతంగా వైరల్‌ అవుతోంది. అంతే ట్రెండింగ్‌లోనూ ఉంటుంది. అందుకు ఆమె చేస్తున్న సినిమాలు ఓ కారణమైతే.. తమిళ రాజకీయాలు మరో కారణం. ఇప్పుడు మరోసారి ఆమె హాట్‌ టాపిక్‌ అయింది. ఈ మధ్యకాలంలో తమిళ పరిశ్రమలో ఆమె నటించిన ముగ్గురు అగ్ర హీరోల చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఆమె కథానాయిక కావడం విశేషంగా మారింది. ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇందుకు కారణం ఓ అభిమాని నెటిజన్‌ చేసిన పని. విజయ్‌, అజిత్‌, సూర్య కెరీర్‌లో హయ్యస్ట్‌ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో త్రిష నటించారని రవిచంద్రనాథ్‌ అనే అభిమాని ఓ పోస్టర్‌ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అందులో విజయ్‌ హయ్యస్ట్‌ గ్రాసర్‌ ‘లియో’, అజిత్‌కు ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’, సూర్యకు కరుప్పు.. ఈ హీరోల బ్లాక్‌బస్టర్‌ చిత్రాల వెనుక ఉన్న కామన్‌ రీజన్‌ త్రిష, ఆమె మ్యాజిక్‌ ఉందని పేర్కొన్నారు. ఆ పోస్ట్‌ను త్రిష ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసి హార్ట్‌ ఎమోజీతో కృతజ్ఞతలు తెలిపారు.

Trisha.jpg

విజయ్‌ హీరోగా నటించిన ‘లియో’ ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. రూ.600 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది. 2023లో ఈ చిత్రం విడుదలైంది. ఇక అజిత్‌ నటించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ ఆయన కెరీర్‌ బెస్ట్‌ హిట్‌గా నిలిచింది. రూ.248 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2025లో విడుదలైన ఈ సినిమాలో త్రిష కథానాయిక. తాజాగా సూర్య హీరోగా విడుదలైన ‘కరుప్పు’లో కూడా త్రిష హీరోయిన్‌గా నటించారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈచిత్రం సూర్యకు మంచి కమ్‌బ్యాక్‌గా నిలిచి రూ.300 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ మూడు ిసినిమాల్లోనూ త్రిష కథానాయిక కావడం ఓ లక్కీఛార్మ్‌ అని అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Updated Date - May 25 , 2026 | 11:58 AM