ప్రేమ ఎప్పుడూ గొప్పదే.. త్రిష పోస్ట్ వైరల్!.
ABN , Publish Date - May 13 , 2026 | 07:54 AM
తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం అనంతరం త్రిష చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది.
తమిళనాడు సీఎమ్‌గా విజయ్ (Vijay) ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో త్రిష (Trisha) ప్రత్యేకాకర్షణగా నిలిచారు. ఆ సమయంలో ఆమె ధరించిన నీలం రంగు చీరతో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram post) పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
‘ప్రేమ ఎప్పుడూ గొప్పదే’ అని అర్థం వచ్చేలా కాప్షన్ పెట్టారు. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక ఆమె పెట్టిన తొలి పోస్ట్ ఇదే కావడంతో పాటు వారిద్దరి రిలేషన్‌పై అంతటా చర్చ జరుగుతున్న వేళ ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా వారిద్దరూ కలసి ‘గిల్లి’, ‘తిరుపాచి’, ‘ఆది’, ‘కురువి’, ‘లియో’ చిత్రాల్లో నటించి విజయవంతమైన జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సూర్య కథానాయకుడిగా ఆర్‌జే బాలాజీ తెరకెక్కించిన ‘వీరభద్రుడు’తో ప్రేక్షకులను పలకరించనున్నారు త్రిష.