Toxic: యశ్ మితిమీరిన రొమాన్స్.. మహిళా కమీషన్ మండిపాటు

ABN , Publish Date - Jan 13 , 2026 | 02:58 PM

యశ్‌ (Yash) హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్‌’ (Toxic) చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే! ఇందులో కొన్ని సన్నివేశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

యశ్‌ (Yash) హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్‌’ (Toxic) చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే! ఇందులో కొన్ని సన్నివేశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అశ్లీల సన్నివేశాలపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా కమిషన్‌ రంగంలోకి దిగింది. ఈ వివాదంపై తగిన చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలంటూ సెన్సార్‌ బోర్డుకు లేఖ రాసింది. టీజర్‌లో పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అభ్యంతరకరమైన దృశ్యాలు ఉన్నాయని ఆమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉషామోహన్‌ మహిళా కమిషన్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీజర్‌ను తొలగించాలని కోరారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కమిషన్‌.. సెన్సార్‌ బోర్డుకు లేఖ రాసింది. సమస్యను పరిశీలించాలని ఆ లేఖలో పేర్కొంది.

యశ్‌ హీరోగా గీతూ మోహన్‌దాస్‌ (Geethu mohan das) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ‘ఎ ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్‌అప్స్‌’ అనేది ఉప శీర్షిక. యశ్‌ పుట్టినరోజు సందర్బ?ంగా ఆయన క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అందులో ఇంటిమేట్‌ సన్నివేశా?ని ఎక్కువగా ఉండడంతో విమర్శలొచ్చాయి. ఆ విమర్శలపై గితూ మోహన్‌దాస్‌ స్పందించారు. ‘మహిళా దర్శకురాలు ఇలాంటి సన్నివేశాలు తెరకెక్కించిందంటూ వస్తోన్న విమర్శలు చూసి నేను చిల్‌ అవుతున్నాను’ అని ఆమె అన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 02:58 PM