టొవినో థామస్, కయదు లోహర్.. పళ్లిచట్టంబి మూవీ తెలుగు ట్రైలర్
ABN , Publish Date - Apr 05 , 2026 | 01:11 PM
టొవినో థామస్, సౌత్ లేటెస్ట్ సెన్షేషన్ కయదు లోహర్ జంటగా మలయాళంలో రూపొందిన పీరియడ్ యాక్షన్-డ్రామా థ్రిల్లర్ పల్లీ చట్టంబీ.
మలయాళ స్టార్ టొవినో థామస్ (Tovino Thomas), సౌత్ లేటెస్ట్ సెన్షేషన్ కయదు లోహర్ (Kayadu lohar) జంటగా మలయాళంలో రూపొందిన పీరియడ్ యాక్షన్-డ్రామా థ్రిల్లర్ పల్లీ చట్టంబీ (Pallichattambi). డీజే టోస్ అంటోనీ (Dijo Jose Antony) దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ జనాధరణ దక్కించుకోగా తాజాగా ఆదివారం ఈ చిత్రం ట్రైలర్‌లను మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ (JAKES BEJOY) సంగీతం అందించాడు.
ఈ ట్రైలర్‌ను చూస్తే 1950,60లలో కేరళలోని మారుమూల కొండ ప్రాంతాలలో వలస ప్రజలు, వారి కష్టాలు, సామాజిక పరిస్థితులు ఇతరత్రా అంశాలను ప్రధానంశంగా చేసుకుని ఈచిత్రాన్ని తెరకెక్కించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. చట్టంతో, సమాజంతో పని లేకుండా అందరికీ దూరంగా జీవితం వెళ్లదీస్తున్న హీరో లైఫ్‌లోకి సడన్‌గా అతని గతంకు సంబధించిన సమస్యలు ఒక్కొక్కటిగా ఎదురవుతాయి. పాత శత్రువులు వెంటాడడం వారి నుంచి తప్పించుకుంటూ తనను తాను రక్షించుకుంటూ తన వారిని ఎలా కాపాడుకున్నాడనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.