విషు పండక్కి 'పళ్ళిచట్టంబి'!

ABN , Publish Date - Apr 09 , 2026 | 03:45 PM

టొవినో థామస్‌, కయదు లోహర్‌ 'పళ్ళిచట్టంబి' మూవీ విడుదల వాయిదా పడింది. ఈ నెల 10న రావాల్సిన చిత్రాన్ని ఏప్రిల్ 15న విషు కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.

Tovino Thomas

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'పళ్ళిచట్టంబి'. ఈ వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈప్రెస్టీజియస్ మూవీని ఏప్రిల్ 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌ చేయాలని అనుకున్నారు. కానీ అనుకున్నామని జరగవు అన్ని అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ సినిమాను 10వ తేదీన విడుదల చేయలేకపోతున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే... అతి త్వరలోనే ఎదురైన అడ్డంకులను దాటుకుని, మలయాళీల నూతన సంవత్సరం విషు కానుకగా ఏప్రిల్‌ 15న దీనిని విడుదల చేస్తామని చెబుతున్నారు.


కేరళం రాష్ట్రంలో 9వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో అక్కడి అధికార యంత్రాంగం అంతా ఎన్నికల ఏర్పాట్లలో బిజీ అయిపోయింది. అయితే 'పళ్ళిచట్టంబి'కి అనుకున్న సమయంలో సెన్సార్‌ సర్టిఫికెట్ చేతికి రాలేదని, దానితో ఎదురైన సాంకేతిక సమస్యల కారణంగా సినిమాను శుక్రవారం విడుదల చేయలేకపోతున్నారని తెలుస్తోంది. మరి మలయాళ సినిమా పరిస్థితే ఇలా ఉంటే... ముందు చెప్పినట్టు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఏప్రిల్ 15న విడుదల చేస్తారా? లేకపోతే కొద్ది రోజులు ఆలస్యంగా విడుదల చేస్తారా? అనేది చూడాలి. అయితే మాతృకలో సినిమా విడుదలైన ఒకటి రెండు వారాల్లో డబ్బింగ్‌ వర్షన్‌ థియేటర్లలో విడుదలైతే సరే... మరింత ఆలస్యమైతే మాత్రం ఆ తర్వాత ఒకటి రెండు వారాల్లో ఓటీటీలో ఇలాంటి సినిమాలు దర్శనమిస్తాయి కాబట్టి... ఎవ్వరూ థియేటర్లకు వెళ్ళడం లేదు. సో... ఇతర భాషల్లో 'పళ్ళిచట్టంబి' ఎప్పుడు వస్తుందో చూడాలి.

టొవినో థామస్‌, కయదు లోహర్‌ జంటగా నటించిన ఈ పీరియాడిక్‌ డ్రామాలో విజయ రాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెగ్జాండర్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

Updated Date - Apr 09 , 2026 | 03:45 PM