చివరి శ్వాస వరకూ.. నటిస్తూనే ఉంటా
ABN , Publish Date - Apr 10 , 2026 | 07:34 AM
వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ, డెబ్బై ఏళ్ల వయసులోనూ విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్నారు మలయాళ అగ్రహీరో మమ్ముట్టి.
వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ, డెబ్బై ఏళ్ల వయసులోనూ విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్నారు మలయాళ అగ్రహీరో మమ్ముట్టి (Mammootty). ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నటుడిగా రిటైర్మెంట్ అనే మాట తన డిక్షనరీలో లేదని స్పష్టం చేశారు. ప్రతి కళాకారుడూ తన చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలని కోరుకుంటారని అభిప్రాయపడ్డారు.
‘నటుడికి రిటైర్మెంట్ ఉండదు. ఊపిరి ఉన్నంత వరకూ కెమెరా ముందుండడమే నట జీవితానికి అసలైన సార్థకత’ అని ఆయన పేర్కొన్నారు. ‘నా ఆరోగ్యం సహకరించినంత కాలం, ప్రేక్షకులు నన్ను చూడాలనుకున్నంత కాలం నటిస్తూనే ఉంటాను’ అని చెప్పారు.