Atlee: తమిళం - హిందీకి తేడా లేదు

ABN , Publish Date - Oct 06 , 2026 | 03:29 PM

స్టార్ డైరెక్టర్ అట్లీ తన తదుపరి చిత్రం ‘రాకా’తో ఆస్కార్ స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

atlee

ఎలాంటి ఫ్లాప్స్‌ లేకుండా కమర్షియల్ సక్సెస్ సాధిస్తున్న దర్శకుడు అట్లీ (Atlee) తన రాబోయే ప్రాజెక్ట్ ‘రాకా’(Raaka) తో ఏకంగా ఆస్కార్ (Oscars) ను టార్గెట్ చేశానని చెప్పడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు రొటీన్ ఫార్ములా, శంకర్ మార్క్ సినిమాలనే రీసైకిల్ చేస్తాడనే ముద్ర ఉన్న ఆయన నుంచి ఇంతటి భారీ స్టేట్‌మెంట్ రావడం కాస్త అతిగానే ఉందని కొందరు పెదవి విరుస్తున్నారు. ఆస్కార్ స్థాయి కంటెంట్‌‌ను ఇప్పటిదాకా డెలివర్ చేయని అట్లీ, మరి ఈసారి నిజంగానే ఆ రేంజ్ మ్యాజిక్ చేసి చూపుతాడో లేక ఇది కూడా మరో బోల్డ్ స్టేట్‌మెంట్‌గానే మిగిలిపోతుందో వేచి చూడాలి.

చెన్నైలో ఇటీవ‌ల‌ జరిగిన ఓ సినిమా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 'పారాసైట్' (Parasite) సినిమాలాగే నేను కూడా బ‌త్తా (Baththa) చిత్రాన్ని ఆస్కార్‌ బరిలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. స్కూల్ రోజుల్లో విజ‌య్ (vijay) సార్‌తో సినిమా చేస్తానని, షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సార్‌తో కలిసి హిందీలో 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించే చిత్రాన్ని అందిస్తానని చెప్పినప్పుడు అందరూ నవ్వేవారు, కానీ నేను నాడు చెప్పిన ఆ మాటల‌ను అన్ని నిజం చేసి చూపించాను. అలాగే #Raaka చిత్రాన్ని కూడా ఆస్కార్‌ స్థాయికి తీసుకెళ్తాను. ఒకవేళ ఆస్కార్ గెలిస్తే మాత్రం కచ్చితంగా తమిళంలోనే మాట్లాడతాను. మనం దీన్ని సాధించగలమని మాటిచ్చి మరీ చెబుతున్నాను అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌గా సామాజిక మాధ్య‌మాల్లో ఇప్పుడు ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.

తమిళం - హిందీకి తేడా లేదు దర్శకుడు అట్లీ

సినిమా నిర్మాణంలో హిందీ, తమిళం అనే తేడా లేదని, దీనికి మంచి ఉదాహరణే తాను దర్శకత్వం వహించిన 'జవాన్' చిత్రం అని దర్శకుడు అట్లీ అన్నారు. చెన్నైలో ఇటీవ‌ల‌ జరిగిన ఓ సినిమా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 'నిర్మా తగా చాలా సరళమైన కథలను ఎంచుకుని, దర్శకుడి ఆలోచనా విధానం, నా ఆలోచనా విధానం సరిపోతోనే దర్శకుడిని ఎంచుకుంటాను.

సినిమా కోసం నిర్మాత ఎంతవరకు నిలబడాలనే దానిపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నేను 'రాజా రాణి' తక్కువ బడ్జెట్‌లో తీశాను. ఎక్కువ, తక్కువ బడ్జెట్ అనేది వ్యాపారం కోసమే కథ నాకు నచ్చితే నేను చిన్న సినిమా చేస్తాను. నేను 'రాజా రాణి', 'డ్యూడ్' వంటి చిన్ని చిత్రాలను నిర్మించాలని ఉంది.

హిందీకి, తమిళ భాషకు ఏమాత్రం తేడా లేదు. నేను స్క్రిప్టు తమిళంలోనే రాస్తాను. 'జవాన్'కు కూడా తమిళంలోనే రాశాను. 'పాన్ ఇండియా' అనే ఒక పదానికే పరి మితం చేయొద్దు. హీరో అజిత్ కుమార్ తో ఓ చిత్రం చేయాలని వుంది. అయితే, నేను ఒక చిత్రం పూర్తి చేశాక, రెండు నెలలు విశ్రాంతి తీసుకుంటాను. ఆ తర్వాతే మరో చిత్రంపై దృష్టిసారి స్తాను. ఇపుడు 'రాకా' పూర్తి చేశాక తదుపరి సినిమా గురించి ఆలోచిస్తాను' అని వివరించారు.

Updated Date - Oct 06 , 2026 | 03:52 PM