Thalapathy Vijay: ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్.. సంక్రాంతి బరిలో విజయ్
ABN , Publish Date - Jan 11 , 2026 | 10:47 AM
ఏంటి నిజమా.. దళపతి విజయ్ (Thalapathy Vijay) సంక్రాంతి బరిలో ఉన్నాడా.. ? జన నాయకుడు (Jana Nayakudu) రిలీజ్ అవుతుందా.. ? అని అంటే విజయ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది
Thalapathy Vijay: ఏంటి నిజమా.. దళపతి విజయ్ (Thalapathy Vijay) సంక్రాంతి బరిలో ఉన్నాడా.. ? జన నాయకుడు (Jana Nayakudu) రిలీజ్ అవుతుందా.. ? అని అంటే విజయ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కానీ, అది జన నాయకుడు కాదు. విజయ్ నటించిన హిట్ సినిమా తేరి (Theri).. ఈ పొంగల్ బరిలోకి దిగుతుంది. జన నాయకుడు సినిమాను రిలీజ్ చేయడానికి విజయ్ ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాడు. కానీ, సెన్సార్ సర్టిఫికెట్ కోసం కోర్టుల చుట్టూ మేకర్స్ తిరుగుతూనే ఉన్నారు. అయ్యాయో.. పొంగల్ కి ఉన్న మంచి డేట్ మిస్ అయ్యింది. విజయ్ చివరి చిత్రం రికార్డ్ కలక్షన్స్ సృష్టిస్తుంది అనుకున్నారు.
అయితే జన నాయకుడు రాకపోతేనేం.. ఆ స్థానంలో విజయ్ తేరి వస్తుంది. కోలీవుడ్ లో పొంగల్ సినిమాలు ఈసారి అంత రసవత్తరంగా లేవు. జన నాయకుడు వచ్చి ఉంటే ఆ హైప్ వేరుగా ఉండేది. ప్రస్తుతం పరాశక్తి ఒక్కటే పొంగల్ బరిలో నడుస్తుంది. ఇది కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందని టాక్. కార్తీ వా వాతియార్ జనవరి 14 న రంగంలోకి దిగుతుంది. ఇది అటు ఇటు అయితే తమిళ్ సంక్రాంతి చప్పగా ఉన్నట్టే. అందుకే బాగా ఆలోచించిన తేరి మేకర్స్.. విజయ్ క్రేజ్ ని వాడుకుందామని తమ సినిమాను రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. జనవరి 15 న తేరి రీ రిలీజ్ కానుంది.
విజయ్ - అట్లీ కాంబోలో వచ్చిన చిత్రాల్లో మొదటి సినిమా తేరి. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కలైపులి ఎస్. థాను నిర్మించాడు. 2016 లో వచ్చిన తేరి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తెలుగులో పోలీసోడు అనే పేరుతో రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇదే సినిమా లైన్ తో తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ను తెరకెక్కిస్తున్నాడు. ఏదిఏమైనా విజయ్ మాత్రం తేరి రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చాడు. పొంగల్ కి విజయ్ కనిపించడు అనుకున్నవారికి ఈ విధంగా దళపతి కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.