Jana Nayakudu Trailer: అతనే దళపతి.. ముట్టుకోకు.. ముక్కలు చేసేస్తాడు

ABN , Publish Date - Jan 03 , 2026 | 07:54 PM

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay).. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. పూర్తిగా ఆయన రాజకీయాలకు అంకితమవ్వనున్నాడు. ఇక చివరగా అభిమానుల కోసం ఒక సినిమా చేశాడు. అదే జన నాయగన్(Jana Nayagan).

Jana Nayakudu Trailer

Jana Nayakudu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay).. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. పూర్తిగా ఆయన రాజకీయాలకు అంకితమవ్వనున్నాడు. ఇక చివరగా అభిమానుల కోసం ఒక సినిమా చేశాడు. అదే జన నాయగన్(Jana Nayagan). తెలుగులో జన నాయకుడు (Jana Nayakudu) పేరుతో రిలీజ్ కానుంది. హెచ్. వినోత్ (H Vinoth) దర్శకత్వం వహించిన ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే (Pooja Hegde) నటిస్తుండగా.. మమితా బైజు (Mamitha Baiju) కీలక పాత్రల్లో నటిస్తుంది. బాబీ డియోల్ (Bobby Deol) విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9 న జన నాయకుడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా జన నాయకుడు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మొదటి నుంచి ఈ సినిమా.. తెలుగులో సూపర్ హిట్ అయిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి. ట్రైలర్ చూసాకా అది నిజమే అని కన్ఫర్మ్ అయ్యింది. భగవంత్ కేసరి సినిమాను ఉన్నది ఉన్నట్లుగా రీమేక్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసాఫీసర్ దళపతి వెట్రి కొండన్ .. తన కూతురు విజ్జిని ఆర్మీ ఆఫీసర్ గా చేసే ప్రయత్నంలో ఎదుర్కున్న సంఘటనల సమూహారమే జన నాయకుడు. ఈ కథ అంతా తెలుగువారికి తెల్సిందే.

ఇక ట్రైలర్ లో ఎక్కువ విజయ్ రాజకీయానికి సంబంధించిన డైలాగ్సే ఉన్నాయి. అతని పేరు దళపతి వెట్రి కొండన్ కూడా బయట అతని పార్టీ TVK అని వచ్చేలా పెట్టారు. 'నిన్ను నాశనం చేస్తాను.. అవమానిస్తాను అని ఎవడు చెప్పినా సరే.. తిరిగి వెళ్లే అవకాశమే లేదు' అనే డైలాగ్ హేటర్స్ కి విజయ్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు ఉంది. ఇక ' అర్హత లేని వాళ్లంతా కలిసి నిలబడ్డారు.. వాళ్లు గెలవకూడదు'. 'ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాలకు రమ్మంటే హత్యలు చేయడానికి, దోచుకోవడానికంట్రా రాజకీయాల్లోకి వచ్చేది' లాంటి డైలాగ్స్ వేరే పార్టీని ఉద్దేశించి చెప్పినట్లు ఉన్నాయని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి విజయ్ చివరి చిత్రం అభిమానులను అలరిస్తుందా ..? లేదా.. ? అనేది చూడాలి.

Updated Date - Jan 03 , 2026 | 07:54 PM