తమిళనాడులో సినిమా షోలకు కొత్త టైమింగ్స్.. ఉదయం 6 నుంచి అర్ధరాత్రి వరకు అనుమతి కోరిన నిర్మాతలు!
ABN , Publish Date - Oct 30 , 2026 | 06:24 AM
తమిళనాడులో ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలని నిర్మాతల సంఘాలు మంత్రి రాజ్ మోహన్‌ను కోరాయి.
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సినిమా ప్రదర్శనకు అనుమతివ్వాలని సినిమాటోగ్రఫీ మంత్రి రాజ్ మోహన్‌కు (Raj Mohan) తమిళ సినీ నిర్మాతల సంఘాల (Tamil Film Producers) ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ట్రిప్లికేణిలోని కలైవానర్ అరంగంలో మంత్రి రాజ్మా హన్ అధ్యక్షతన తమిళ సినీ ప్రముఖులతో సమావేశం జరిగింది. ఇందులో తమిళ సినీ నిర్మాతల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ సంఘాలు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి.
ప్రధానంగా కొత్త సినిమా విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా గడువు విధించాలని, రాష్ట్ర ప్రభుత్వం తరపున కొత్త ఓటీటీ ప్లాట్‌ఫాం స్థాపించడం, విడుదలకు నోచుకోని చిత్రాలను రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవడం, చిన్నబడ్జెట్ చిత్రాలకు సబ్సీడీ ఇవ్వాలని ఇలా అనేక ప్రధాన డిమాండ్లను నిర్మాతల సంఘాల ప్రతినిధులు మంత్రి ముందుంచారు.
ముఖ్యంగా, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ఉదయం 6 గంటలకే తొలి ఆట ( Movie Show Timings) ప్రదర్శించుకునేందుకు అనుమతిచ్చి అర్థరాత్రి 2 గంటల్లోగా అన్ని షోల ప్రదర్శన పూర్తయ్యేలా అనుమత వ్వాలి. ఇలా చేయడం వల్ల ఒక రోజు ఐదు లేదా ఆరు షోలను ప్రదర్శించుకునే వెసులుబాటు లభిస్తుంది.
ఒకే రోజున అనేక సినిమాలు విడుదలైనప్పటికీ అన్ని సినిమాలను ప్రదర్శించుకునేందుకు థియేటర్లు లభిస్తాయని, అందువల్ల ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సిని మాలను ప్రదర్శించుకునేలా అవకాశం ఇవ్వాలని వారు కోరారు. నిర్మాతల సంఘాల ప్రతినిధుల డిమాండ్లను ఆలకించిన మంత్రి రాజ్ మోహన్ తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.