కలెక్టర్‌కు అసభ్య మెసేజ్ పంపితే.. అరెస్ట్ చేస్తారా? మ‌రోసారి మ‌న్సూర్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు?

ABN , Publish Date - Nov 29 , 2026 | 12:17 PM

ఇటీవ‌ల తమిళనాడు కళ్లకుర్చి జిల్లా కలెక్టర్‌కు అసభ్య సందేశాలు పంపి అరెస్టయిన టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ కు, నటుడు మన్సూర్ అలీఖాన్ నుంచి మద్దతు లభించింది.

Mansoor Ali Khan, TVK

తమిళనాడు (Tamil Nadu) లోని కళ్లకుర్చి జిల్లా కలెక్టర్‌కు అసభ్య సందేశాలు పంపి అరెస్టయిన ఆ నియోజకవర్గ టీవీకే (TVK) ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ (MLA Arul Vignesh) కు సినీ విలన్, నటుడు మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan) నుంచి మద్దతు లభించింది. కోయంబత్తూరులో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. 'అరుళ్ విఘ్నేశ్ మహిళా కలెక్టర్‌కు ఏదో అసభ్య మెసేజ్ పంపాడు. అంతమాత్రానికే అతనిని అరెస్టు చేస్తారా.. అదేమైనా హత్యలాంటి నేరమా?' అంటూ వ్యాఖ్యానించారు.

'కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు కదా, ఎలా ప్రవర్తించాలో తెలియక కలెక్టర్‌కు మెసేజ్ పంపాడు. వెంటనే క్షమాపణ చెప్పి ఉండాల్సింది. నేనైతే అతనిని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి గుంజీలు తీయించేవాడిని' అని పేర్కొన్నారు. తాను కూడా టీవీకే సభ్యుడినని, తనకు ఎలాంటి పదవులు లేకపోయినా పార్టీకి కట్టుబడి ఉంటానని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని వెల్లడించారు. కాగా, టీవీకే ఎమ్మెల్యేకు మద్దతుగా మాట్లాడిన మన్సూర్ అలీఖాన్ పట్ల సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది

ఎమ్మెల్యేకు 15 రోజుల రిమాండ్

కళ్లకుర్చి (Kallakurichi) జిల్లా కలెక్టర్‌కు అసభ్య సందేశాలు పంపిన కేసులో అరెస్టయిన టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్కు డిసెంబరు 11వ తేదీ వరకు రిమాండ్ విధిం చారు. శుక్రవారం సాయంత్రం అరుళ్ విఘ్నేశ్ను కళ్లకుర్చిలో అరెస్టు చేసిన పోలీసులు.. అర్థరాత్రి వరకు ప్రత్యేకంగా విచారణ జరిపారు. అనంతరం ఆయన్ని కళ్లకుర్చి 1వ జుడిషియల్ మేజిస్ట్రేట్ భానుమతి ముందు హాజరుపర చగా, 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేను కడలూరు కేంద్ర కారాగారానికి తరలించారు.

Updated Date - Nov 29 , 2026 | 12:32 PM