కలా.. నిజమా.. త్రిష లేకుండా మొదటిసారి ఒంటరిగా విజయ్
ABN , Publish Date - Nov 21 , 2026 | 09:35 PM
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ (Kaviya Maran) వివాహ రిసెప్షన్ వేడుక చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. నవంబర్ 11న గ్రీస్‌లో సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగ్గా, శనివారం జరిగిన గ్రాండ్ రిసెప్షన్‌కు దేశంలోని అత్యున్నత రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తరలివచ్చారు.
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ (Kaviya Maran) వివాహ రిసెప్షన్ వేడుక చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. నవంబర్ 11న గ్రీస్‌లో సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగ్గా, శనివారం జరిగిన గ్రాండ్ రిసెప్షన్‌కు దేశంలోని అత్యున్నత రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తరలివచ్చారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఫ్యామిలీ, పలు రాష్ట్రాల మంత్రులతో పాటు సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, క్రికెటర్లు కేన్ విలియమ్సన్, డేల్ స్టెయిన్ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
అయితే, ఈ వేడుకలో అందరి దృష్టి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎంట్రీపైనే పడింది. మొదట నీలంకరైలో డీఎండీకే ఎంపీ ఎల్.కె. సుధీష్ కుమార్తె వేడుకకు హాజరైన విజయ్, ఆ తర్వాత గిండీలోని ఐటీసీ గ్రాండ్ చోళకు భారీ భద్రత నడుమ బ్లూ ఇండో-వెస్ట్రన్ సూట్లో స్టైలిష్‌గా విచ్చేశారు. అయితే, మొదటిసారి విజయ్ ఇలా ఒక భారీ వేడుకకు ఒంటరిగా రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా విజయ్ ఎక్కడికి వెళ్లినా పక్కన స్టార్ హీరోయిన్ త్రిష ఖచ్చితంగా కనిపిస్తూనే వచ్చింది. కానీ, ఈసారి రిసెప్షన్లో మాత్రం విజయ్ పక్కన త్రిష ఎక్కడా కనిపించలేదు.ప్రతి వేడుకలో కూడా విజయ్ - త్రిష జంటగా కనిపించి సోషల్ మీడియాని షేక్ చేసేవారు. ఈసారి విజయ్ ఒక్కరే కనిపించి షాక్ ఇచ్చారు.
విజయ్ ఒక్కరే ఈ వేడుకలో కనిపించడంతో నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా రకరకాల చర్చలకు తెరలేపారు. వీరిద్దరి మధ్య ఏమైనా మనస్పర్థలు వచ్చి విడిపోయారా? లేక త్రిష తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల ఈ వేడుకకు రాలేకపోయారా? అంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఏదేమైనా, అనిరుధ్ - కావ్య మారన్ రిసెప్షన్ వేడుకలో సెలబ్రిటీల సందడి ఒకవైపు ఉంటే, విజయ్ సోలో ఎంట్రీ, త్రిష గైర్హాజరీ అంశం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సడెన్ గా త్రిష లేకుండా మొట్టమొదటిసారి విజయ్ ని సోలోగా చూసినవారు.. కలా.. నిజమా.. విజయ్ ఒక్కరే వచ్చారా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ రిసెప్షన్ కి విజయ్ భార్య సంగీత కూడా హాజరయ్యింది. ఆమె వస్తోంది అని తెలియడంతోనే విజయ్ - త్రిష జంటగా రాలేదని కొందరు చెప్పుకొస్తున్నారు.