Makutam: ఒరేయ్.. థియేటర్లో ప్లాప్ అన్నారు కదా.. టాప్ ట్రెండింగ్ లో ఎలారా

ABN , Publish Date - Sep 14 , 2026 | 11:01 AM

ఈ రోజుల్లో అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలలో అసలు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఇష్టపడతారో ఎవరికీ అర్థం కావడం లేదు. బిగ్ స్క్రీన్ మీద భారీ ఆశలతో వచ్చి థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలోకి వచ్చేసరికి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటూ ప్లాప్ అవుతున్నాయి.

Makutam

ఈ రోజుల్లో అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలలో అసలు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఇష్టపడతారో ఎవరికీ అర్థం కావడం లేదు. బిగ్ స్క్రీన్ మీద భారీ ఆశలతో వచ్చి థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలోకి వచ్చేసరికి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటూ ప్లాప్ అవుతున్నాయి. అదే సమయంలో థియేటర్ల వద్ద డిజాస్టర్‌గా నిలిచి, బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సినిమాలకు మాత్రం డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ పై ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ (Vishal) నటించిన లేటెస్ట్ సినిమా మకుటం (Makutam) కూడా సరిగ్గా ఇదే బాటలో పయనిస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.


కోలీవుడ్ నటుడు విశాల్ ద్విపాత్రాభినయం చేయడమే కాకుండా తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తెరకెక్కించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ మకుటం . అంజలి, దుషార విజయన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చి మోస్తరు వసూళ్లను సాధించింది. దాదాపు మూడు గంటల నిడివి,సుదీర్ఘమైన స్క్రీన్‌ప్లేపై థియేట్రికల్ రిలీజ్ సమయంలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, విశాల్ నటన, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.


థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే, అంటే సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. థియేటర్ల నుంచి నేరుగా మీ ఇళ్లకు.. ప్రేక్షకుల ప్రేమ ఇలాగే కొనసాగుతోంది అంటూ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో చేసిన అధికారిక పోస్ట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది సమయంలోనే ఈ సినిమా ఓటీటీ ట్రెండింగ్ చార్ట్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం.


ఇంట్లోనే వీక్షించే వెసులుబాటు దక్కడంతో ఓటీటీ ప్రియులు ఈ సినిమాపై విపరీతంగా స్పందిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా, తండ్రీకొడుకుల మధ్య సాగే ప్రతికార రాజకీయం, విశాల్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. దీంతో ఒరేయ్.. థియేటర్లో ప్లాప్ అన్నారు కదా.. టాప్ ట్రెండింగ్ లో ఎలారా అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు. మరి మకుటం ఓటీటీలో ముందు ముందు ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.

Updated Date - Sep 14 , 2026 | 11:01 AM