Vishal: దర్శకత్వమే కాదు పాట కూడా పాడేశాడు!

ABN , Publish Date - Jun 20 , 2026 | 06:26 PM

విశాల్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మకుటం'. ఈ సినిమా నుండి 'రైజ్ ఆఫ్‌ లింగా' అనే పాటను విడుదల చేశారు. దీన్ని విశాల్‌, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ పాడారు.

Vishal Makutam Movie

వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. విశాల్ 35వ చిత్రం రాబోతోన్న ‘మకుటం’ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద, స్వర్గీయ ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా నిర్మితమౌతోంది. విశాల్‌ సరసన అంజలి, దుషార విజయన్ నటిస్తున్న ఈ చిత్రానికి రవి అరసు కథను అందించారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి.


'మకుటం' మూవీలో విశాల్ మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతోన్నారు. తాజాగా విశాల్ ఈ సినిమాలో చేస్తున్న లింగా అనే పవర్ ఫుల్ పాత్రకు సంబంధించిన లుక్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ మేరకు ‘రైజ్ ఆఫ్ లింగా’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను చూస్తుంటే సినిమాలో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతు న్నట్టుగా తెలుస్తోంది. ‘రైజ్ ఆఫ్ లింగా’ పాటని విశాల్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ సంయుక్తంగా ఆలపించారు. వచ్చే నెలలో మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

‘OG 2’లో ఊహించని మార్పులు.. షూటింగ్ డేట్ ఫిక్స్!

పవన్ అభిమాని నిరంజన్‌‌ను ఈ రోజే కలవడానికి కారణమిదే: బండ్ల గణేష్

మాట నిలబెట్టుకున్న థమన్‌.. ఎంత గొప్ప మనసో!

రుక్మిణి వసంత్‌ మార్ఫింగ్ ఫొటోలు.. ముగ్గురు అరెస్ట్!

Updated Date - Jun 20 , 2026 | 06:32 PM