విక్రమ్ పరువు తీస్తున్న కొడుకు .. మరో వివాదంలో ధృవ్

ABN , Publish Date - Aug 18 , 2026 | 09:46 PM

తమిళ వర్సటైల్ యాక్టర్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ ఆయన పరువును తీయడానికే కంకణం కట్టుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో ఏ వారసుడు తీసుకురాని వివాదాలను ధృవ్ తెచ్చిపెడుతున్నాడు.

Dhruv vikram

తమిళ వర్సటైల్ యాక్టర్ విక్రమ్ (Vikram) కొడుకు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) ఆయన పరువును తీయడానికే కంకణం కట్టుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో ఏ వారసుడు తీసుకురాని వివాదాలను ధృవ్ తెచ్చిపెడుతున్నాడు. హీరోగా లాంచ్ అయిన దగ్గర నుంచి ఈ కుర్రాడు చేసినవి కొన్ని సినిమాలే అయినా, వివాదాలు మాత్రం లెక్కలేనన్ని ఎదుర్కొంటున్నాడు. ఇక ఈమధ్య నటి అనుపమ పరమేశ్వరన్‌తో బ్రేకప్, ధృవ్ ఎంత టాక్సిక్ అని ఆమె చెప్పిన విధానం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. ఇటీవలే ఈ బ్రేకప్ విషయంపై ధృవ్ స్పందిస్తూ.. ప్రేమించిన వారికి బలం ఇవ్వాలి, ట్రోల్స్ వలన నేను కూడా బాధపడ్డాను అని చెప్పాడు. అయితే ఈ వివాదం ముగియకముందే, సినిమా చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుని నిర్మాతలను మోసం చేశాడంటూ మరో వివాదం రగులుకుంది. ఇది పాతదే అయినా మరోసారి నిర్మాతలు ఛాంబర్ మెట్లు ఎక్కనున్నారని టాక్.


గతంలో ధృవ్ విక్రమ్‌పై తమిళ ఫిల్మ్ ఛాంబర్‌లో నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో ధృవ్‌తో ఒక సినిమా ఓకే చేసి.. రూ. 1 కోటి అడ్వాన్స్ తీసుకున్నాడు. దీంతో మేకర్స్ పాటలు, సెట్లు, నటీనటుల ముందస్తు ఖర్చుల కోసం నిర్మాతలు భారీగా డబ్బులు వెచ్చించారు. కానీ షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి తమకు చెప్పకుండా ధృవ్ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో కరణ్ దర్శకత్వంలో ఓ సినిమాను #DV4 గా అనౌన్స్ చేశాడు. లెక్క ప్రకారం రమేష్ వర్మతో చేయాల్సిన చిత్రమే #DV4 కావాలని, మైత్రీ మూవీస్ ప్రాజెక్ట్ #DV5 అవ్వాలని నిర్మాతలు స్పష్టం చేశారు.


ఇక ఈ విషయంపై ధృవ్‌ను ప్రశ్నించగా, మైత్రీ సినిమా పూర్తయ్యాకే రమేష్ వర్మ సినిమా చేస్తానని రకరకాల కారణాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అలా చేస్తే తాము భారీగా వడ్డీల భారం మోయాల్సి వస్తుందని, తమకు సమాచారం ఇవ్వకుండా మరో నిర్మాతతో సినిమా మొదలుపెట్టి తమను మోసం చేశారంటూ నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించిన విషయం తెల్సిందే. ఇంత జరిగినా కూడా ధృవ్ .. ఆ సినిమా గురించి పట్టించుకోవడం లేదని నిర్మాతలు మరోసారి ఛాంబర్ కి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇంకోపక్క ఈ వ్యవహారంపై తమిళ ఫిల్మ్ ఛాంబర్ కూడా ధృవ్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ధృవ్ కి ఇచ్చిన కోటితోపాటు.. సెట్ ఖర్చులు, వడ్డీలు కలిపి నిర్మాతలకు రూ. 2 కోట్లు వరకు నష్టపోయారట. ఇప్పుడు ఈ రూ. 2 కోట్లు ధృవ్ కడతాడా లేక సినిమా చేస్తాడా అనేది చూడాల్సి ఉంది. అయితే ఇలాంటి వరుస వివాదాల వల్ల కొడుకును సరిగ్గా పెంచలేదంటూ సోషల్ మీడియాలో విక్రమ్‌పై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదాలకు ధృవ్ ఫుల్ స్టాప్ పెడతాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Updated Date - Aug 18 , 2026 | 09:46 PM