Jana Nayagan: అధికారిక ప్రకటన వచ్చేసింది!

ABN , Publish Date - Jul 15 , 2026 | 02:06 PM

హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న విజయ్‌ చివరి చిత్రం 'జన నాయగన్' ఈ నెల 23న విడుదల కాబోతోంది.

Jana Nayagan Movie

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్' విడుదల విషయంలో క్లారిటీ వచ్చేసింది. రివైజింగ్‌ కమిటీ నుంచి ఈ సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ లభించిందని, దానితో ఈ నెల 24న 'జన నాయగన్'ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని కొద్ది రోజుల ముందు ఎన్.ఆర్.ఐ. ఎగ్జిబిటర్స్ స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే 'జన నాయగన్' మూవీ 24న కాకుండా ఒక రోజు ముందే 23నే విడుదల అవుతుందని మరో ప్రచారం జరిగింది. ఇప్పుడదే విషయం నిజమైంది.

WhatsApp Image 2026-07-15 at 3.03.43 PM.jpeg


ఇదిలా ఉంటే... విజయ్‌ తనయుడు జాసన్ సంజయ్ తెరకెక్కించిన 'సిగ్మా' మూవీ ఈ నెల 31న విడుదల కావాల్సి ఉంది. ఈ తండ్రీ కొడుకుల మధ్య ప్రస్తుతానికి సత్ సంబంధాలు లేకపోయినా... వీరి సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ విడుదల కావడం పట్ల కోలీవుడ్ వర్గాలలో గాఢమైన చర్చ సాగుతోంది. అయితే... సంక్రాంతి విడుదల కావాల్సిన 'జన నాయగన్' ఇంతకాలానికి సెన్సార్ ఉక్కు పిడికిలి నుంచి బయటకు వచ్చి విడుదల కానుండటం పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సెల్రబేషన్ మూమెంట్ కు 'జన నాయగన్' మేకర్స్ ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనేది ఓ పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే... ఎన్నికల ప్రచార సమయంలో విజయ్‌ నిర్వహించిన బహిరంగ సభ కారణంగా జరిగిన తొక్కిసలాటలో నలభై మందికి పైగా ప్రజలు చనిపోయారు. అలాంటి దుర్ఘటనలు ఏవీ 'జన నాయగన్' సినిమా విడుదల రోజు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు సీఎంగా ఉన్న విజయ్ మీద ఉంది.

'జన నాయగన్' రిలీజ్‌ టైమ్‌లో ఎలాంటి చేదు సంఘటన జరిగినా విజయ్‌... ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే... చాలా లో-ప్రొఫైల్‌లో 'జన నాయగన్'ను మేకర్స్ విడుదల చేయాలనుకుంటున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా తమిళనాడు సీఎం విజయ్‌ పట్ల ప్రజలకే కాదు.. ప్రేక్షకులకూ ప్రత్యేకమైన అభిమానం ఉంది. అది 'జన నాయగన్' కలెక్షన్స్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. 'జన నాయగన్' సాధించే రికార్డులు ఎవరి ఊహకూ అందనంత స్థాయిలో ఉంటాయని ట్రేడ్ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను హెచ్. వినోద్ తెరకెక్కించారు. అలాంటి 'జన నాయగన్' ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే 23వ తేదీ వరకూ వేచి ఉండాలి.

ఇవి కూడా చదవండి:

మాది అఫీషియల్.. ఎన్టీఆర్‌కే షాకిచ్చిన రాఎన్టీఆర్‌!

Priyanka Chopra: 14 నెలలుగా 'వారణాసి' కోసం కష్టపడుతున్నా.. ప్రియాంకా చోప్రా అంత మాట అనేసిందేంటి

Updated Date - Jul 15 , 2026 | 03:54 PM