Divorce Case: సీఎం విజయ్ భార్య సంచలన నిర్ణయం

ABN , Publish Date - Aug 07 , 2026 | 03:59 PM

తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ విడాకుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ (Cm Vijay) విడాకుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన విజయ్–సంగీత విడాకుల కేసుకు చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం తెరదించింది. విజయ్ భార్య సంగీత (Sangeetha) తన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో కోర్టు కేసును ముగించింది.  కొన్ని నెలలుగా ఈ కేసు పలుమార్లు విచారణకు వచ్చినప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా జరిగిన విచారణలో సంగీత తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు కోర్టుకు తెలియజేశారు. దీంతో చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం విడాకుల కేసును అధికారికంగా ముగించింది. 


విజయ్ తరఫు న్యాయవాదులు గత విచారణల్లో తమిళనాడు శాసనసభ సమావేశాలు, ముఖ్యమంత్రి హోదాకు సంబంధించిన అధికారిక బాధ్యతలు, భద్రతా కారణాల వల్ల వ్యక్తిగత హాజరు కావడానికి ఇబ్బందులు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సంగీత తరఫు న్యాయవాది కూడా  విచారణను వేగవంతం చేయాలని కోరారు. అయితే తాజా పరిణామంతో కేసు పూర్తిగా ముగిసింది. 

Updated Date - Aug 07 , 2026 | 04:04 PM