నాన్న కుట్టి ట్రైలర్.. కూతురు కోసం ఒక తండ్రి చేసే పోరాటం
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:10 PM
బిచ్చగాడు సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితుడిగా మారిన హీరో విజయ్ ఆంటోనీ. ఈ సినిమా తరువాత ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది.
బిచ్చగాడు సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితుడిగా మారిన హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony). ఈ సినిమా తరువాత ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. ఈ ఏడాదిలోనే వంద దేవుళ్లు సినిమాతో మంచి విజయాన్ని అందుకొన్న విజయ్.. తాజాగా నాన్న కుట్టి (Nanna Kutty) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ము. మారన్ (Mu. Maran) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శర్వంత్ రామ్ క్రియేషన్స్, రామాంజనేయులు జవ్వాజి ప్రొడక్షన్స్, విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా నాన్న కుట్టి ట్రైలర్ ని మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. బిచ్చగాడులో తల్లి ప్రేమని ఎంతో హృద్యంగా చూపించిన విజయ్ ఆంటోనీ.. నాన్న కుట్టిలో తండ్రి ప్రేమ చూపించి ఎమోషనల్ అయ్యేలా చేశాడు. పుట్టిన వెంటనే కూతురికి తల్లి దూరమవ్వడంతో అన్ని తానే అయ్యి పెంచే తండ్రి పాత్రలో విజయ్ ఆంటోని కనిపించాడు. ఇక ఆ కూతురికి ఒక సమస్య ఎదురైనప్పుడు.. ఆ తండ్రి కూతురు కోసం చేసిన పోరాటం ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. అసలు ఆ చిన్నారికి ఉన్న సమస్య ఏంటి.. ? ఆ సమస్య కోసం హీరో ఏం చేశాడు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఒకవైపు ఫ్యామిలీ ఎమోషన్స్, మరోవైపు యాక్షన్ ఘట్టాలు, పోలీస్ స్టేషన్, కోర్టు డ్రామాతో నాన్న కుట్టి ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా పాప దియాకు మెడికల్ చెకప్ చేయించాలనే ప్రస్తావన, కోర్టులో వాదనలు, నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందన్న అంశం ట్రైలర్‌కు మరింత బలాన్ని చేకూర్చింది. అంతేకాకుండా విజయ్ ఆంటోనీ నిజ జీవితంలో కూడా ఒక దారుణమైన సంఘటన జరిగిన విషయం తెల్సిందే. ఆయన పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఇక ఈ చిత్రంలో విజయ్ తన కూతురినే తలచుకొని నటించినట్లు ఉంది. నాన్న కుట్టి నవంబర్ 27న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో విజయ్ ఆంటోని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.