క్రైమ్ థ్రిల్లర్లకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు.. విజయ్ ఆంటోనీతో కొత్త ప్రయోగం!

ABN , Publish Date - Nov 11 , 2026 | 10:12 AM

ఒక చిత్రానికి కంటెంటే కింగ్ అని ప్రతి ఒక్కరూ అంటుంటారని, 'అలాంటి ఒక మంచి కంటెంట్‌తో రూపొందిన చిత్రమే అప్పాకుట్టి అని ఆ చిత్ర దర్శకుడు ము.మారన్ అన్నారు.

Vijay Antony

ఒక చిత్రానికి కంటెంటే కింగ్ అని ప్రతి ఒక్కరూ అంటుంటారని, 'అలాంటి ఒక మంచి కంటెంట్‌తో రూపొందిన చిత్రమే అప్పాకుట్టి (Appakutti) అని ఆ చిత్ర దర్శకుడు ము.మారన్ అన్నారు. తెలుగులో నాన్నకుట్టి (Nanna Kutti) గా వ‌స్తోంది. విజయ్ ఆంటోనీ (Vijay Antony), ప్రీతి అశ్రాణి (Preethi Asrani) జంటగా నటించి ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక ఇటీవ‌ల చెన్నైలో జరిగింది. ఇందులో ఆర్ట్ డైరెక్టర్ రాజా, కెమెరామెన్ రాజీవ్ రాజేంద్రన్, గీత రచయితలు ఏకాదశి, అరుణ్ భారతి, నటీమ ణులు హరిప్రియ, హరిత, లిస్సీ ఆంటోనీ, నటుడు మూణారు రమేష్, డిస్ట్రిబ్యూటర్ ఫైవ్ స్టార్ సెంథిల్, చిత్ర దర్శకుడు ము.మారన్, దర్శకులు శశి, మందిరమూర్తి, నిర్మాత దనుంజయన్, నటుడు మురుగానందం, హీరోయిన్ ప్రీతి అస్రాణి, హీరో విజయ్ ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు ము.మారన్ మాట్లాడుతూ, 'ఇది నా నాలుగో చిత్రం. గత మూడు చిత్రాలు క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఒకే జానర్‌లో ఎందుకు సినిమాలు తీస్తున్నారంటూ ప్రశ్నించారు. అందుకే ఈ సారి విభిన్నమైన కథాంశంతో ప్రయత్నించాను. ఈ కథ విన్న ప్రతి ఒక్కరికీ ఎంతగానో నచ్చింది. చివరగా ఒక పెద్ద నిర్మాణ సంస్థ ప్రతినిధులకు కథ వినిపించగా వారికి నచ్చింది. అయితే, హీరోగా విజయ్ ఆంటోనీ పేరు సూచించాను. అలా నిర్మాత వైజయంతి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు.

ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌కున్కు వచ్చి చిత్ర బృందాన్ని అభినందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' తెలిపారు. హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ, 'అప్పాకుట్టి' తండ్రీకూతుళ్ళ మధ్య ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగ సంబంధంపై దృష్టి సారించిన యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ, కుటుంబ భావాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలున్నాయి. ఈ చిత్రంలో అన్ని వర్గాల అభిమానులను తప్పకుండా ఆకట్టుకుంటుంది' అని పేర్కొన్నారు.

Updated Date - Nov 11 , 2026 | 11:00 AM