విజయ్ కోసం అమ్మ పట్టుచీరలో త్రిష..

ABN , Publish Date - Aug 16 , 2026 | 06:46 PM

తమిళ చిత్రసీమలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి 2004లో నటించిన గిల్లీ చిత్రం నాటి నుంచే వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో అనేక రకాల పుకార్లు మొదలయ్యాయి.

Trisha Krishnan

తమిళ చిత్రసీమలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి 2004లో నటించిన గిల్లీ చిత్రం నాటి నుంచే వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో అనేక రకాల పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత తిరుపాచి, ఆతి, కురువి, ఇటీవల వచ్చిన లియో వంటి సినిమాలతో ఈ జోడీ కెమిస్ట్రీ మరింత బలపడింది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న తీవ్రమైన సాన్నిహిత్యం కారణంగానే విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకోవడానికి కోర్టుకు వెళ్ళింది. ఆ తరువాత విజయ్ సీఎంగా గెలవడం, త్రిషతో కలిసి తిరగడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇక సంగీత లండన్ నుంచి తిరిగి వచ్చి విడాకుల కేసును వెనక్కి తీసుకొని.. ఇంటి వద్దనే సెటిల్ చేసుకొని వెళ్లిపోయిందని టాక్.


ఈ వివాదాలు, రూమర్లు ఎంతగా ప్రచారంలో ఉన్నప్పటికీ, విజయ్, త్రిష ఎప్పుడూ వీటిపై బహిరంగంగా స్పందించలేదు. ఇటీవల విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి సంబంధించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో త్రిష హాజరుకావడం మరోసారి ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేడుకలో విజయ్ భార్య సంగీత ఎక్కడా కనిపించకపోవడం, అదే సమయంలో విజయ్ తల్లిదండ్రులైన ఎస్.ఎ. చంద్రశేఖర్, శోభల పక్కన ముందు వరుసలోనే త్రిష కూర్చోవడం అందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో విజయ్ - త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలకు బలం చేకూరింది.


అయితే ఈ వేడుకలో తన ప్రత్యేకమైన ట్రెడిషనల్ లుక్ గురించి త్రిష సోషల్ మీడియా వేదికగా స్పందించడంతో ఆ వార్తలకు కొద్దిగా బ్రేక్ పడింది. ఆ ఈవెంట్‌లో తాను ధరించిన పసుపు వర్ణం పట్టు చీర ఏ విధమైన కాస్ట్లీ డిజైనర్ డ్రెస్ కాదని, అది తన తల్లి ఉమా కృష్ణన్‌కి చెందిన పాత చీర అని ఆమె వెల్లడించింది. అంతేకాకుండా, ఈ ముఖ్యమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు తాను ఏ రకమైన ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్‌ను కూడా నియమించుకోలేదని, ఇంట్లోనే సొంతంగా మేకప్ చేసుకుని సిద్ధమైనట్లు చెప్పుకొచ్చింది.


ఎంతో ఆడంబరంగా ఉండే సినీ ప్రపంచంలో ఉంటూ కూడా, అంతటి ప్రాధాన్యత కలిగిన ఒక రాజకీయ వేడుకకు తన తల్లి చీరను కట్టుకుని, ఎలాంటి హంగులు లేకుండా ఎంతో సాధారణంగా కనిపిస్తూనే సంప్రదాయబద్ధమైన లుక్‌తో ఆకట్టుకున్న త్రిష సింప్లిసిటీని అభిమానులు, నెటిజన్లు విశేషంగా ప్రశంసిస్తున్నారు. మొన్నటివరకు సైలెంట్ గా ఉన్న త్రిష.. ఇప్పుడు బహిరంగంగా అందరి ముందుకు రావడంతో.. కచ్చితంగా విజయ్ పార్టీలో ఆమెకు మంచి పదవే దక్కనుందని, అంతకుమించి సీఎం భార్య అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. మరి తమిళనాడు రాజకీయాల్లో విజయ్ - త్రిష పేర్లు చరిత్రలో నిలిచిపోతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

Updated Date - Aug 16 , 2026 | 06:46 PM