షాకింగ్.. బీజేపీలోకి విజయ్ భార్య
ABN , Publish Date - Jun 01 , 2026 | 08:35 PM
తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ (Vijay) బాధ్యతలు స్వీకరించి, తన మార్క్ పాలనతో దూసుకుపోతుండటం తెలిసిందే. ఆయన సీఎం అయి ఇప్పటికే చాలా రోజులు గడుస్తున్నా.. విజయ్ పొలిటికల్ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ (Vijay) బాధ్యతలు స్వీకరించి, తన మార్క్ పాలనతో దూసుకుపోతుండటం తెలిసిందే. ఆయన సీఎం అయి ఇప్పటికే చాలా రోజులు గడుస్తున్నా.. విజయ్ పొలిటికల్ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే, ఆయన పాలనపై ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తున్న తరుణంలోనే, దళపతిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు తెరవెనుక ఒక భారీ పొలిటికల్ స్కెచ్ సిద్ధమైందనే వార్తలు ఇప్పుడు కోలీవుడ్, పొలిటికల్ సర్కిల్స్‌ను ఊపేస్తున్నాయి. సీఎం విజయ్ భార్య సంగీత త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరబోతున్నారనే ప్రచారం తీవ్ర సంచలనంగా మారింది.
ప్రస్తుతం విజయ్‌ని డైరెక్ట్‌గా ఎదుర్కోవడం సాధ్యం కాకపోవడంతో, ఆయన కుటుంబంలోనే చిచ్చు పెట్టి డిఫెన్స్‌లో పడేయాలనేదే ఈ బీజేపీ స్కెచ్ వెనుక ఉన్న అసలు వ్యూహమని తమిళ వర్గాలు కోడై కూస్తున్నాయి. విజయ్, సంగీత మధ్య గత కొంతకాలంగా ఉన్న వ్యక్తిగత విభేదాలనే అస్త్రంగా చేసుకుని, ఆమెను పార్టీలోకి లాగడం ద్వారా సీఎం ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని ప్రత్యర్థులు చూస్తున్నారట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య స్వయంగా కేంద్ర అధికార పార్టీలో చేరితే, అది దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అవుతుందని, తద్వారా విజయ్ పీఠాన్ని కదిలించవచ్చని ఈ పొలిటికల్ ప్లాన్ వేసినట్లు టాక్. దీనికి సంగీత కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.
ఇదంతా ఒక సీనియర్ నటి చేయిస్తోందని.. బీజేపీలో ఉన్న ఆ నటి, నిత్యం సంగీతను కలుస్తూ.. రాజకీయ ఎంట్రీ ఇవ్వమని, మంచి పదవిని ఇస్తామని రాయబారాలు నడుపుతుందంట. ఈ వార్తలో నిజమెంత అనేది తెలియదు కానీ, ఇదే నిజమైతే విజయ్ ఇమేజ్, ఆయన పార్టీ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు. అయితే, ఈ వార్తలపై అటు విజయ్ టీమ్ నుండి కానీ, ఇటు సంగీత సన్నిహితుల నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సంగీత లండన్‌లో ఉంటున్నారని, రాజకీయాలకు ఆమె పూర్తిగా దూరంగా ఉంటారని మరో వర్గం వాదన. గతంలోనూ ఇలాంటి ఎన్నో పుకార్లు వచ్చినప్పటికీ, ఈసారి విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉండటం వల్ల ఈ వార్త నిజమే అని అంటున్నారు. మరి దీనిపై విజయ్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.