మమితా బైజు సినిమాతో తరుణ్ భాస్కర్ కోలీవుడ్ ఎంట్రీ..
ABN , Publish Date - Oct 23 , 2026 | 06:07 PM
యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్-డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) సినిమా రంగంలో మరో అడుగు ముందుకు వేసి నిర్మాతగా మారిన విషయం తెల్సిందే. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ సెన్సేషన్ 'పీఆర్ షో' (PR Show) పేరుతో కొత్త నిర్మాణ సంస్థను లాంచ్ చేసి ఆ బ్యానర్లో తెరకెక్కుతున్న తొలి ప్రాజెక్ట్‌కు తాత్కాలికంగా PRS01 అనే టైటిల్‌ను ఖరారుచేసిన విషయం కూడా విదితమే.
యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్-డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) సినిమా రంగంలో మరో అడుగు ముందుకు వేసి నిర్మాతగా మారిన విషయం తెల్సిందే. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ సెన్సేషన్ 'పీఆర్ షో' (PR Show) పేరుతో కొత్త నిర్మాణ సంస్థను లాంచ్ చేసి ఆ బ్యానర్లో తెరకెక్కుతున్న తొలి ప్రాజెక్ట్‌కు తాత్కాలికంగా PRS01 అనే టైటిల్‌ను ఖరారుచేసిన విషయం కూడా విదితమే. ఈ సినిమాలో టాలెంటెడ్ బ్యూటీ మమితా బైజు లీడ్ రోల్లో నటిస్తుండగా, ఈ ప్రాజెక్ట్‌కి కథ అందించడంతో పాటు క్రియేటివ్ బాధ్యతలను కూడా ప్రదీప్ స్వయంగా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇక ఈ చిత్రంలో అశ్వత్ మారిముత్తు, స్వాసిక, నూతన నటి అనమికా మాహితో పాటు తెలుగు నటుడు శివాజీ సోంటినేని తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం అశ్వత్ మారిముత్తు ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ఎంట్రీ ఇచ్చాడట. విలక్షణమైన కథలతో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న తరుణ్ భాస్కర్ ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
ప్రస్తుతం అశ్వత్ మారిముత్తు.. ధర్మన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఒకపక్క నటుడిగా.. ఇంకోపక్క డైరెక్టర్ గా చేయడం వలన కొద్దిగా డేట్స్ ఇబ్బంది అవ్వడం వలనే ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని టాక్ నడుస్తోంది. ఇక తరుణ్ భాస్కర్ కూడా డైరెక్టర్ కమ్ యాక్టర్ కావడంతో ప్రదీప్.. తరుణ్ ని తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తరుణ్.. యాక్టర్ గానే బిజీగా మారాడు. ఆయన దర్శకత్వం వహిస్తోన్న ఈ నగరానికి ఏమైంది 2 షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యిందని టాక్. తెలుగులో యాక్టర్ గా, డైరెక్టర్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్.. ఇప్పుడు ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా చూడాలి.