అజిత్ క్రేజీ లైనప్.. లిస్ట్ లో శంకర్ కూడా
ABN , Publish Date - Aug 09 , 2026 | 09:43 PM
కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో వేగం పెంచాడు. బ్యాక్ టు బ్యాక్ బిగ్ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ అభిమానులను, సినీ ప్రేక్షకులను ఖుషీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ (Ajith Kumar) ప్రస్తుతం వరుస సినిమాలతో వేగం పెంచాడు. బ్యాక్ టు బ్యాక్ బిగ్ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ అభిమానులను, సినీ ప్రేక్షకులను ఖుషీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. గతేడాది గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చిన అజిత్ తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటించబోయే తదుపరి చిత్రం డెర్‌డెవిల్ (Daredevil). ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కాకుండా అజిత్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక డెర్‌డెవిల్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కేవలం 75 రోజుల్లోనే పూర్తి చేయాలని అజిత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.సెప్టెంబర్‌లో మొదటిగా 6 రోజుల పాటు ఒక చిన్న షెడ్యూల్ ని ఫినిష్ చేసి.. ఆ తరువాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగే ఫుల్-ఫ్లెడ్జ్డ్ గా షూటింగ్‌లో అజిత్ పాల్గొననున్నాడని టాక్. డిసెంబర్ నాటికి ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలన్నీ పూర్తవుతాయి. వచ్చే ఏడాది జనవరిలో మిగిలిన నటీనటులపై సన్నివేశాలు, ప్యాచ్ వర్క్ పూర్తి చేసి ఆధిక్ రవిచంద్రన్ టాకీ పార్ట్‌ను క్లోజ్ చేసి సంక్రాంతి బరిలో దింపాలని చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
డెర్‌డెవిల్ షూటింగ్ పూర్తయిన వెంటనే, జనవరి నుంచి డైరెక్టర్ వెంకట్ ప్రభు ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. తమిళ చిత్రసీమలో సరికొత్త రికార్డులు సృష్టించిన మంకాతకు సీక్వెల్‌గా మంకాత 2 తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇదే ఆ ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇవే కాకుండా దిగ్గజ దర్శకుడు శంకర్ ఒక క్విక్ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన అజిత్ కుమార్‌ను సంప్రదించినట్లు టాక్. రీజనబుల్ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాకి సంబంధించి అజిత్, శంకర్‌ల పారితోషికాల చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. గేమ్ ఛేంజర్ తరువాత శంకర్ .. అజిత్ తో చేతులు కలపడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస సంచలన ప్రాజెక్టులతో స్పీడ్ పెంచిన అజిత్ కుమార్ లైనప్ చూసి ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.