డోరతీ.. ఏం సినిమారా బాబు.. పిచ్చెక్కిపోతున్నారు
ABN , Publish Date - Oct 25 , 2026 | 03:41 PM
చాలామంది ప్రేక్షకులు సినిమాలను ఎలా చూస్తున్నారు అంటే.. థియేటర్ లో అందరితో పాటు చూసి వారు నవ్వితే నవ్వడం,ఏడిస్తే ఏడవడం చేస్తున్నారు. అందరూ బాలేదు అంటే.. తమకు నచ్చినా కూడా పైకి మాత్రం బాలేదంటున్నారు.
చాలామంది ప్రేక్షకులు సినిమాలను ఎలా చూస్తున్నారు అంటే.. థియేటర్ లో అందరితో పాటు చూసి వారు నవ్వితే నవ్వడం,ఏడిస్తే ఏడవడం చేస్తున్నారు. అందరూ బాలేదు అంటే.. తమకు నచ్చినా కూడా పైకి మాత్రం బాలేదంటున్నారు. ఇక అదే సినిమా ఓటీటీలోకి వచ్చాక ఏం సినిమారా బాబు మెంటల్ వచ్చేస్తోంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో చేరిన సినిమా డోరతీ (Dorothy). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రిషికాంత్, సనత్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.
మొదట ఈ సినిమా ఒక నార్మల్ సినిమాలా ప్రమోట్ చేసినా కూడా సినిమా చూసి జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ సినిమా LGBTQ నేపధ్యంలో తెరకెక్కిందని తెలిసి షాక్ అయ్యారు.థియేటర్లలో విడుదలై నెగటివ్ టాక్‌ను మూటగట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో మాత్రం ఊహించని రీతిలో సంచలనాలు సృష్టిస్తోంది. థియేటర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన ఈ చిత్రం, డిజిటల్ స్క్రీన్‌పైకి రాగానే ట్రెండ్‌ను పూర్తిగా మార్చేసింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం వ్యూయర్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుండటం విశేషం.
కథ విషయానికొస్తే.. కార్తీ(రిషికాంత్), సుబ్బు(సనత్) చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇద్దరి కులాలు వేరైనా వాటిని పట్టించుకోకుండా స్నేహంగా పెరుగుతారు. ఇక సుబ్బు ఇంట్లో ఆడవారు ఎవరూ ఉండరు. తండ్రి, ఇద్దరు అన్నలతో కలిసి ఉంటాడు. ఆ సమయంలో రెండో అన్న, డోరతీ(కీర్తి సురేష్) ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తాడు. డోరతీ వచ్చాక సుబ్బులో చాలా మార్పు వస్తుంది. అంతా బావుంది అనుకోలేపూ డోరతీ సడెన్ గా ఆత్మహత్య చేసుకుంటుంది. వదిన మరణం తరువాత సుబ్బు ఏమయ్యాడు.. ? ప్రాణంగా మెలిగిన సుబ్బును కార్తీ ఎందుకు చంపాలనుకుంటాడు.. ? చివరికీ వీరిద్దరూ ఎలా కలుస్తారు..? అనేది కథ.
మొదట ఇలాంటి ఒక స్టోరీని ఎంచుకున్న డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. మొదటి భాగం మొత్తం ఆయన మార్క్ కుల వివక్ష, గొడవలు ఇవే ఉంటాయి. ఎప్పుడైతే డోరతీ మరణించిందో అప్పటి నుంచి వచ్చే కథనే వేరు ఉంటుంది. లింగ వివక్ష గురించి ఈ సినిమాలో చూపించిన విధానం చాలా అద్బుతంగా ఉంటుంది. ఇక చివరి షాట్ అయితే నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లో ఈ మూవీని రిజెక్ట్ చేసిన ఆడియెన్స్, ఇప్పుడు ఓటీటీలో విపరీతంగా చూస్తూ ట్రెండింగ్‌లో నిలిపారు. థియేటర్ రన్ సమయంలో ఉన్న నెగటివ్ టాక్, డిజిటల్ ఆడియెన్స్ ముందుకు వచ్చేసరికి పూర్తిగా పాజిటివ్ బజ్‌గా మారిపోవడం గమనార్హం.
ఈ సినిమాకు ప్రధానంగా ఇద్దరు దిగ్గజాలు ప్రాణంగా నిలిచారు. టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు టేకింగ్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్‌గా నిలిచింది. ఆయన తెరకెక్కించిన విధానం, కథను నడిపించిన తీరు ఓటీటీ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇక దీనికి తోడు ఇళయరాజా సంగీతం సినిమా స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఆయన అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని భావోద్వీపాలను అద్భుతంగా ఎలివేట్ చేసింది. ఇక రిషికాంత్, సనత్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఏం సినిమారా బాబు.. మెంటల్ ఎక్కించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.