విజయ్- అజిత్ హాగ్.. చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదే

ABN , Publish Date - Sep 12 , 2026 | 09:03 PM

సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. అలాంటినది తమిళ్ తంబీలు దేవుళ్లుగా భావించే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి హాగ్ చేసుకుంటే ఇక వారి ఆనందం వర్ణనాతీతం.

Vijay- Ajith

సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. అలాంటినది తమిళ్ తంబీలు దేవుళ్లుగా భావించే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి హాగ్ చేసుకుంటే ఇక వారి ఆనందం వర్ణనాతీతం. తాజాగా కోలీవుడ్ స్టార్స్ విజయ్ (Vijay) - అజిత్ (Ajith) కలిసి కనిపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధ్యక్షుడు విజయ్ తన విదేశీ పర్యటనలో భాగంగా యునైటెడ్ కింగ్‌డమ్ లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మోటార్ రేస్‌ను ప్రారంభించనున్న విషయం తెల్సిందే. అంతేకాకుండా ఈ అంతర్జాతీయ రేసింగ్ టోర్నమెంట్‌లో తమిళ ఇండస్ట్రీ మరో స్టార్ హీరో, ప్రొఫెషనల్ రేసర్ అజిత్ కుమార్ స్వయంగా పాల్గొని పోటీ పడుతుండటం విశేషం. దశాబ్దాలుగా మోటార్ స్పోర్ట్స్‌పై ఎంతో అభిరుచి కలిగిన అజిత్, ఈ అంతర్జాతీయ వేదికపై తన రేసింగ్ ప్రతిభను నిరూపించుకోవడానికి సర్వసన్నద్ధమయ్యాడు. 


ఒకే వేదికపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రేసింగ్‌ను ఫ్లాగ్ ఆఫ్ చేయడం, అదే రేస్‌లో స్టార్ హీరో అజిత్ కుమార్ కంపిటీటర్‌గా బరిలోకి దిగుతుండటంతో ఈ ఈవెంట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. కొద్దిసేపటి క్రితమే విజయ్.. ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. అంతేకాకుండా అజిత్ ని చూడగానే.. పరిగెత్తుకుంటూ వెళ్లి అజిత్ ని హాగ్ చేసుకోవడం సంచలనంగా మారింది. వీరిద్దరూ అలా కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. 


తమిళ చిత్రసీమలో ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ప్రత్యర్థులుగా ఉన్న విజయ్, అజిత్‌లు ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా వేదికపై ఇలా ఒకరికొకరు మద్దతుగా కలవడం స్పోర్ట్స్,  పొలిటికల్ వర్గాల్లో సరికొత్త సంకేతాలను పంపుతోంది. సినిమా, రాజకీయం నుంచి  స్పోర్ట్స్ రంగానికి విస్తరించిన ఈ ఇద్దరి బంధం, రాబోయే రోజుల్లో తమిళనాడులో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి మరింత దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం కోలీవుడ్ సినీ ప్రియులతో పాటు రేసింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి కనిపించడంతో పాటు హాగ్ చేసుకొని కనిపించడంతో వీరి మ్యూచువల్ ఫ్యాన్స్ అబ్బబ్బా.. చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదే అని కామెంట్స్ చేస్తున్నారు. 

Updated Date - Sep 12 , 2026 | 09:04 PM