తమిళ సినిమాలకు తమిళ పేర్లే పెట్టాలి.. విజయ్ ఆంటోనీపై తంగర్ బచ్చన్ ప్రశంసలు!

ABN , Publish Date - Nov 19 , 2026 | 07:02 AM

తమిళ సినిమాలకు ఆంగ్ల పేర్లు పెడుతున్నారంటూ స్టంట్ మాస్టర్ తంగర్ బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ ఆంటోనీ నటించిన 'అప్పాకుట్టి' చిత్రానికి తమిళ పేరు పెట్టడంపై ప్రశంసలు కురిపించారు.

Vijay Antony

ఇటీవలి కాలంలో సినిమాలకు ఆంగ్లంలోనే పేర్లు పెడుతున్నారని, తమిళ పేర్లు కనిపించడం లేదని, కానీ, ఈ చిత్రానికి హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony,) అచ్చ తమిళ పేరు పెట్టినందుకు ధన్యవాదాలని ప్రముఖ స్టంట్ మాస్టర్ తంగర్ బచ్చన్ (Thangar Bachchan) అన్నారు. ము.మారన్ (Mu Maran) దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ, ప్రీతి అస్రానీ (Preethi Asrani) జంటగా నటించిన అప్పా కుట్టి (తెలుగులో నాన్న కుట్టి) (Appakutti) చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. దీన్ని పురస్కరించుకుని చిత్ర బృందం తాజాగా చెన్నైలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా తంగర్ బచ్చన్ మాట్లాడుతూ, 'తమిళంలో పేరు పెట్టినందుకు చిత్ర బృందానికి ధన్యవాదాలు. తమిళంలో నిర్మించే చిత్రాలకు తమిళంలో పేర్లుండటం చాలా ముఖ్యం. ఒక వారంలో ఆరేడు సినిమాలు విడు దలైతే రెండు చిత్రాలకు కూడా తమిళంలో పేర్లు లేవు. ఈ విషయాన్ని ఇటు మీడియా, అటు కళాకారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ప్రభుత్వ హయాంలో తమిళ పేర్లను ప్రోత్రహిస్తూ, పన్ను రాయితీ ఇచ్చేవారు. ఇపుడు ఈ విషయంపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయో లేదో తెలియదు ఇది చాలా బాధాకరం' అన్నారు.

నిర్మాత ఫాతిమా మాట్లాడుతూ.. విజయ్ ఆంటోనీ చెప్పులు ధరించకపోవడానికి గల కారణాన్ని వివరించారు. హీరో విజయ్ ఆంటోనీ చిత్రంలో తండ్రీ కుమార్తె మధ్య అనుబంధాన్ని చాలా గాఢంగా చూపించాం. హృదయాలను హత్తుకునే సన్నివేశాలున్నాయి' అని అన్నారు. దర్శకుడు ముమార న్ మాట్లాడుతూ, 'ఈ సినిమా నాకు అత్యుత్తమ అనుభవాన్ని ఇచ్చింది. కథపై ఉన్న నమ్మకంతో గట్టి పోటీ మధ్య మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని పేర్కొన్నారు. కాగా, విజయ్ ఆంటోనీ ఫిలిమ్స్ పతాకంపై ఫాతిమా, ధనుంజయన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Updated Date - Nov 19 , 2026 | 07:02 AM