జైలర్ 2 లో అదిరిన మూర్తి కామెడీ.. మరో ఛాన్స్ ఇచ్చిన రజనీ
ABN , Publish Date - Oct 27 , 2026 | 08:07 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ 2 (Jailer 2) బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ 2 (Jailer 2) బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అంతగా హిట్ అయ్యింది అంటే దానికి ఒక ప్రధాన కారణం మూర్తి. ఆ పాత్రలో నటుడు నమో నారాయణ (Namo Narayana) చేసిన కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ఆయనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించినా రాని గుర్తింపు జైలర్ 2 ఒక్కటి తీసుకొచ్చింది.
జైలర్ 2 నమో నారాయణ కామెడీ కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాదు రజనీకి కూడా తెగ నచ్చేసిందట. ఆయన కామెడీ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుందని నమ్మి రజనీ.. నమో నారాయణకి మరో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రెండు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ధర్మన్.అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో రామ్ పోతినేని, రాశీ ఖన్నా, శ్రీలీల, సిమ్రాన్, నయనతార తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ధర్మన్ లో పాత్ర లేకపోయినా నమో నారాయణ కామెడీ ట్రాక్ పెట్టమని డైరెక్టర్ ని రజనీ రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. దీంతో అశ్వత్ మారిముత్తు ఒక అద్బుతమైన కామెడీ ట్రాక్ ని రాశాడట. జైలర్ 2 లో మూర్తి పాత్రలో ఎంత అయితే నవ్విస్తాడో .. దానికి మించి ధర్మన్ లో మూర్తి కామెడీ ఉండబోతుందని సమాచారం. అదే కనుక నిజమైతే మూర్తిని ఇండస్ట్రీలో ఎవరూ ఆపలేరు అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.